- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
బాణాసంచా కేంద్రంలో పేలుడు..ముగ్గురు సజీవదహనం
బాణాసంచా కేంద్రంలో జరిగిన పేలుడులో ముగ్గురు కార్మికులు సజీవదహనం చెందారు....

దిశ, వెబ్ డెస్క్: బాణాసంచా కేంద్రం(Fireworks Center)లో జరిగిన పేలుడు(Explosion)లో ముగ్గురు కార్మికులు సజీవదహనం చెందారు.ఈ ఘటన తమిళనాడు(Tamilanadu) రాష్ట్రం ధర్మపురి(Dharmapuri)లో జరిగింది. రోజూ మాదిరిగా బాణా సంచా కేంద్రంలో కార్మికులు ఈ రోజు కూడా పని చేస్తున్నారు. అయితే ఊహించని ఘటన వారిని ప్రమాదంలోకి నెట్టింది. ఒక్కసారిగా బాణా కేంద్రంలో బ్లాస్టింగ్ జరిగింది. ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. ఏం జరిగిందో తెలిసే లోపు ముగ్గురు సజీవ దహనం అయ్యారు. మరో నలుగురికి తీవ్ర గాయాలయ్యాయి. క్షతగాత్రులు, మృతులను ఆస్పతికి తరలించారు. విషయం తెలుసుకున్న పోలీసులు, ఫైర్ సిబ్బంది సంఘటనా స్థలం వద్ద సహాయక చర్యలు అందిస్తున్నారు. బాస్టింగ్ జరిగిన ప్రదేశంలో శిథిలాలను తొలగిస్తున్నారు. చనిపోయిన ముగ్గురు వ్యక్తుల వివరాలు సేకరిస్తున్నారు. బాణా సంచా కేంద్రం యజమానికి సమాచారం అందించారు. ఫైర్ సిబ్బంది మంటలను అదుపు చేస్తున్నారు. ఘటన కారణాలను తెలుసుకుంటున్నారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.






