వేర్వేరు ప్రాంతాల్లో ముగ్గురు అదృశ్యం

by Ratna Kumari |

హయత్​నగర్​ పోలీస్​ స్టేషన్​ పరిధిలోని వేర్వేరు ప్రాంతాల్లో ముగ్గురు వ్యక్తులు అదృశ్యమైన ఘటనలు శుక్రవారం చోటు చేసుకున్నాయి.

వేర్వేరు ప్రాంతాల్లో ముగ్గురు అదృశ్యం
X

దిశ, వనస్థలిపురం : హయత్​నగర్​ పోలీస్​ స్టేషన్​ పరిధిలోని వేర్వేరు ప్రాంతాల్లో ముగ్గురు వ్యక్తులు అదృశ్యమైన ఘటనలు శుక్రవారం చోటు చేసుకున్నాయి. కుటుంబ కలహాలు, ఆర్థిక ఇబ్బందులు, వ్యక్తిగత కారణాల నేపథ్యంలో ఇంటి నుంచి వెళ్లిపోయినట్లు వారి కుటుంబ సభ్యులు హయత్​నగర్​ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ ఘటనలపై పోలీసులు మిస్సింగ్ కేసులు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. సీఐ నాగరాజ్​గౌడ్​ వివరాల ప్రకారం.. హయత్​నగర్​కు చెందిన విజయ్ - మంజుల పార్వతమ్మ దంపతులకు ఇద్దరు కుమారులు, ఒక కుమార్తె ఉన్నారు. వారం రోజులుగా భార్యాభర్తల మధ్య తరచూ గొడవలు జరుగుతున్నట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. ఈ నెల 14న మంజుల పార్వతమ్మ (38) ఇంట్లో ఎవరికీ చెప్పకుండా వెళ్లిపోయింది. బంధువుల ఇళ్లలో తెలిసిన ప్రాంతాల్లో వెతికినా ఆచూకీ లభించకపోవడంతో కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

బంధువుల పెళ్లికి వెళ్తానని వెళ్లి ప్రభుత్వ ఉద్యోగి

హయత్​నగర్​కు చెందిన బానోతు భీమ్‌సింగ్‌ (37) ప్రభుత్వ ఉద్యోగి. ఈ నెల 12న ఉదయం 8:30 గంటలకు బంధువుల పెళ్లికి వెళ్తున్నానని చెప్పి ఇంటి నుంచి వెళ్లిపోయాడు. అయితే తిరిగి ఇంటికి రాకపోవడంతో పాటు ఫోన్‌కూ స్పందించకపోవడంతో కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఇటీవల బెట్టింగ్ అలవాటు కారణంగా అప్పుల్లో ఉన్నట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. ఈ ఘటనపై పోలీసులు మిస్సింగ్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

భార్యతో గొడవపడి.. పండ్ల వ్యాపారి

హయత్​నగర్​ ప్రియదర్శిని కాలనీలో నివాసం ఉంటున్న కడుగు యాకూబ్‌ (55) తన భార్యతో కలిసి పండ్ల వ్యాపారం చేస్తూ జీవనం సాగిస్తున్నాడు. ఈ నెల 14న నగదు విషయంలో భార్యాభర్తల మధ్య వాగ్వాదం జరగగా, యాకూబ్‌ ఇంటి నుంచి వెళ్లిపోయాడు. సాయంత్రం ఇంటికి వచ్చిన భార్యకు ఆయన కనిపించకపోవడంతో కుటుంబ సభ్యులు వెతికినా ఫలితం లేకపోయింది. దీంతో పోలీసులకు ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు సీఐ తెలిపారు.

Next Story