- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
MLA Rajasingh : రాజాసింగ్‌కు మరోసారి బెదిరింపు కాల్స్
గోషామహల్ బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్(MLA Rajasingh)కు మరోసారి బెదిరింపు కాల్స్(Threat Calls) వచ్చినట్లు తెలుస్తోంది.

దిశ, వెబ్ డెస్క్ : గోషామహల్ బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్(MLA Rajasingh)కు మరోసారి బెదిరింపు కాల్స్(Threat Calls) వచ్చినట్లు తెలుస్తోంది. ఈ బెదిరింపులపై ఆయన మంగళ్హాట్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. ఈ మేరకు ఆయన ఓ వీడియో విడుదల చేశారు. గత వారం రోజుల నుంచి బెదిరింపు కాల్స్ వస్తున్నాయని, నిన్న సాయంత్రం 4:11 నుండి 4:17 గంటల మధ్య ఒక్కొక్కటి ఒక నిమిషం వ్యవధిలో తొమ్మిది వేర్వేరు ఫోన్ నంబర్ల నుండి బెదిరింపు కాల్స్ వచ్చినట్లు పేర్కొన్నారు.
చంపేస్తామని, బాంబులతో దాడి చేస్తామని, తన కుటుంబాన్ని కూడా అంతం చేస్తామని బెదిరిస్తున్నట్టు తెలిపారు. తాను పోలీసులకు ఫిర్యాదు చేశానని తెలుపుతూ.. వారి తీరుపై అసంతృప్తి వ్యక్తం చేశారు. మేయర్‌కు బెదిరింపు కాల్ వస్తే వెంటనే అరెస్టు చేస్తారని, కానీ తనకు వందల బెదిరింపు కాల్స్ వచ్చినప్పటికీ ఎఫ్‌ఐఆర్ నమోదు చేయడంలో పోలీసులు నిర్లక్ష్యం చేస్తున్నారని విమర్శించారు.






