- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
మెస్ ఇన్ చార్జి పై ఆరోపణల్లో వాస్తవం లేదు : మహిళా కమిషన్ చైర్ పర్సన్ నేరెళ్ల శారద
దిశ, సికింద్రాబాద్ : ఉస్మానియా యూనివర్సిటీ పీజీ మహిళా హాస్టల్లో మెస్ ఇన్ చార్జి వినోద్ విద్యార్థినుల పట్ల అసభ్యంగా

దిశ, సికింద్రాబాద్ : ఉస్మానియా యూనివర్సిటీ పీజీ మహిళా హాస్టల్లో మెస్ ఇన్ చార్జి వినోద్ విద్యార్థినుల పట్ల అసభ్యంగా ప్రవర్తించాడనే ఆరోపణల్లో స్పష్టత లేదని మహిళా కమిషన్ చైర్మన్ నేరెళ్ల శారద స్పష్టం చేశారు. ఓయూ క్యాంపస్ లేడీస్ హాస్టల్ కేర్ టేకర్ విద్యార్థుల పట్ల అసభ్యకరంగా ప్రవర్తించాడనే ఆరోపణల నేప థ్యంలో బుధవారం రాష్ట్ర మహిళా కమిషన్ చైర్ పర్సన్ నేరెళ్ల శారద ఓయూ లేడీస్ హాస్టల్ ని సందర్శించారు. ఈ సందర్బంగా ఆమె గంటన్నర పాటు విద్యార్థినులతో సమావేశమయ్యారు. కేర్ టేకర్ వినోద్ పై వచ్చిన ఆరోపణలపై నిజా నిజాలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం ఆమె మీడియాతో మాట్లాడుతూ రెండు మూడు రోజులుగా మీడి యాలో వస్తు న్న వార్తా కథనాలపై నిజా, నిజాలు తెలుసుకునేందుకు కోఠిలోని మహిళా యూనివ ర్సిటీ కివెళ్లాం. అనం తరం ఓయూ క్యాంపస్ కి వచ్చినట్లు ఆమె వెల్లడించారు.
ఉమెన్స్ కాలేజీ అమ్మాయిలు ఆరోపించినట్టుగా ఇక్కడ ఏమి జరగలేదని పలువురు విద్యార్థినులు చెప్పారని ఆమె తెలిపారు. అనంతరం తాము వర్సిటీ క్యాంపస్ లోని లేడీస్ హాస్టల్లో విద్యార్థి నులతో సమావేశమయ్యామని తెలిపారు. లేడీస్ హాస్టల్ కూడా చాలా మంది విద్యార్థినులతో మాట్లా డామని, అయితే తామెవరమూ షీ–టీమ్స్కు ఫిర్యాదుచేయలేదని, అసలు ఎవరు ఫిర్యాదు చేశారో కూడా తెలియదని చెపుతున్నారని అన్నారు. అయితే ఇదంతా కావాలనే ఒక స్టూడెంట్ గ్రూప్ యూనియన్ కు చెందిన నాయకులు చేస్తు న్నట్లుగా తమ దృష్టికి వచ్చి నట్లు ఆమె తెలిపారు. షీ–టీమ్స్కు ఫిర్యాదు చేసిన అమ్మాయి ఐడి కూడా ఫేక్ అని చెపు తున్నారని, దీనిపై కూడా విచారణ జరుపుతున్నామన్నారు. ఎరికి అన్యాయం జరిగిందనే విష యాలు స్పష్టంగా తెలియ కపోతే ఎలా ముం దు కు వెళతా మ న్నా రు. నిజంగా అన్యాయం జరిగిన అమ్మాయికి మహిళా కమిషన్ భరోసా ఇస్తుం ది. ఆమె కు అన్ని విధా లుగా అండ గా ఉంటాం. ఫిర్యాదు చేసిన అమ్మాయి వివరాలను కూడా గోప్యంగా ఉంచుతా మన్నారు. మెస్ ఇన్చార్జి తప్పు చేసి నట్లు తేలితే అతనిని కఠినంగా శిక్షిస్తామని శారద స్పష్టం చేశారు.






