- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
గుట్టు చప్పుడు కాకుండా రెండో పెళ్లి చేసుకున్న భర్త ఇంటి ముందు భార్య ఆందోళన
గుట్టు చప్పుడు కాకుండా రెండో పెళ్లి చేసుకున్న భర్త ఇంటి ముందు భార్య ఆందోళన చేపట్టింది.

దిశ, శేరిలింగంపల్లి : వేదమంత్రాలు సాక్షిగా తాళి కట్టాడు. వారి దాంపత్య జీవితానికి గుర్తుగా మూడేళ్ల బాబు ఉన్నాడు. ఇవేవీ పట్టించుకోని భర్త రహస్యంగా రెండో పెళ్లి చేసుకున్నాడు. కట్టుకున్న భార్యను, మూడేళ్ల కొడుకును కాదని రహస్యంగా రెండో పెళ్లి చేసుకోవడమే కాకుండా నిలదీసిన మొదటి భార్య పై దాడికి పాల్పడిన ఉదంతం చందానగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో వెలుగు చూసింది. తనకు, తన బిడ్డకు న్యాయం చేయాలంటూ బాధితురాలు భర్త ఇంటి ముందు నిరసనకు దిగింది. బాధితురాలు, ఆమె కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం బండా రోహిత్ యాదవ్ అనే వ్యక్తికి అల్వాల్ ప్రాంతానికి చెందిన మహాలక్ష్మి తో మూడేళ్ల క్రితం వివాహం జరిగింది. వీరికి ప్రస్తుతం మూడు సంవత్సరాల కుమారుడు ఉన్నాడు. వివాహ సమయంలో 45 తులాల బంగారం ,ఐదు లక్షలు కట్నంతో పాటు ఇతరుల లాంచ నాలు చెల్లించి ఘనంగా వివాహం చేశామని బాధితురాలు కుటుంబ సభ్యులు తెలిపారు. ఉద్యోగం చేస్తున్నాడని నమ్మించడంతో తమ పిల్లనిచ్చామని వివాహం నాటి నుంచి వేధింపులకు గురి చేస్తున్నాడని మహాలక్ష్మి మేనమామ తెలిపారు.
మహాలక్ష్మి తాళి కట్టిన భర్త ఇంటికీ వెళ్లి తనకు తన కుమారుడకు న్యాయం చేయాలని డిమాండ్ చేసింది.. సమాచారం అందుకున్న పోలీసులు ఘటన స్థలానికి చేరుకొని పరిస్థితిని సమీక్షించారు. మొదటి భార్యకు తెలియకుండా గుట్టుచప్పుడు కాకుండా రెండో పెళ్లి చేసుకున్నాడని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇదే విషయాన్ని భర్త ఇంటి ముందు అత్తమామలతోనూ వాగ్వివాదం జరిగింది. తమకు జరిగిన అన్యాయంపై బాధితురాలు మహాలక్ష్మి చందానగర్ పోలీసులను ఆశ్రయించారు. లింగంపల్లి రైల్ విహార్ పేస్ 1 లో నివాసం ఉంటున్న రోహిత్ వివాహానికి ముందు సాఫ్ట్వేర్ ఉద్యోగి అని చెప్పారు. వివాహ నాటి నుంచి ఖాళీగా ఉంటున్నాడనీ ఆరోపించారు. మహాలక్ష్మి గర్భం దాల్చి నప్పటినుంచి మగ పిల్లాడు పుట్టేందుకు మందులు వాడాలని బలవంతం చేశారని , ఇప్పుడు తనకు పుట్టలేదని నిందలు వేస్తూన్నారని మహాలక్ష్మి కుటుంబ సభ్యులు వివరించారు.






