తెలుగు యూనివర్సిటీలో ‘ది ట్రాప్’ నాటిక ప్రదర్శన.. సోషల్ మీడియాపై సందేశం

by Ramesh Naini |

రచయిత అజయ్ మంచనపల్లి, దర్శకుడు వీర మనోహర్ కావలి దర్శకత్వంలో రూపొందిన “ది ట్రాప్” నాటికను తెలుగు యూనివర్సిటీ లలిత కళా ప్రాంగణంలో అద్భుతంగా ప్రదర్శించారు.

తెలుగు యూనివర్సిటీలో ‘ది ట్రాప్’ నాటిక ప్రదర్శన.. సోషల్ మీడియాపై సందేశం
X

దిశ, డైనమిక్ బ్యూరో: తెలంగాణ ఫిలిం డెవలప్మెంట్ కార్పొరేషన్, రంగస్థలి సంయుక్త ఆధ్వర్యంలో, రచయిత అజయ్ మంచనపల్లి రచన, దర్శకుడు వీర మనోహర్ కావలి దర్శకత్వంలో రూపొందిన “ది ట్రాప్” నాటికను ఫిబ్రవరి 28న జాతీయ సైన్స్ డే సందర్భంగా తెలుగు యూనివర్సిటీ లలిత కళా ప్రాంగణంలో ఉదయం 11.30 గంటలకు అద్భుతంగా ప్రదర్శించారు. సమాజంలో సోషల్ మీడియా వల్ల జరుగుతున్న అనర్ధాలను ప్రభావవంతంగా ఆవిష్కరించిన ఈ నాటిక ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంది. ఈ సందర్భంగా దర్శకుడు వీర మనోహర్ కావలి (Director Veera Manohar Kavali) మాట్లాడుతూ, కార్యక్రమానికి సహకరించిన తెలంగాణ ఫిలిం డెవలప్మెంట్ కార్పొరేషన్‌కు కృతజ్ఞతలు తెలిపారు.

Next Story