- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
Cyber Crime : పవర్ స్టార్ పోస్టర్ చూపించి కోట్లు కాజేసిన కేటు గాళ్ళు
సైబర్ నేరగాళ్లు(Cyber Criminals) ఆన్లైన్లో గిఫ్ట్ కార్డులు, వాట్సాప్‌లో లింక్‌లు, పార్సిల్స్ ఇలా ఎన్నో రకాలుగా ప్రజలను మోసం చేస్తూ భారీగా డబ్బులు దోచుకుంటున్నారు.

దిశ, వెబ్ డెస్క్ : సైబర్ నేరగాళ్లు(Cyber Criminals) ఆన్లైన్లో గిఫ్ట్ కార్డులు, వాట్సాప్‌లో లింక్‌లు, పార్సిల్స్ ఇలా ఎన్నో రకాలుగా ప్రజలను మోసం చేస్తూ భారీగా డబ్బులు దోచుకుంటున్నారు. పోలీసులు వారి నేరాలను పసిగట్టినా సరే, మళ్లీ కొత్త కొత్త మోసాలతో సామాన్యులను బురిడీ కొట్టిస్తున్నారు. తాజాగా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్(Power Star Pawan Kalyan) సినిమా ప్రమోషన్ పేరుతో రూ.1.34 కోట్లను ఓ ప్రైవేటు ఉద్యోగి నుంచి తీసుకుని పరారయ్యారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం... హైదరాబాద్ కు చెందిన ఓ ప్రైవేటు ఉద్యోగి తన మిత్రులతో కలిసి తరచూ గోవా వెళ్లి వస్తుండేవాడు. గతేడాది అక్టోబరులో అక్కడి క్యాసినోకు వెళ్లగా శ్రీలంకకు చెందిన ఉదయ్‌రాజ్, వివేక్‌లు పరిచయమయ్యారు. అక్కడ వారు తాము కొత్తగా విడుదలయ్యే తెలుగు సినిమాలకు ప్రమోషన్ ఈవెంట్స్ చేస్తున్నామంటూ నమ్మించారు. అదే నెలలో ఉదయ్‌రాజ్ గచ్చిబౌలిలోని ఓ హోటల్‌కు వస్తే బాధితుడు వెళ్లి అతడిని కలిశాడు. త్వరలో విడుదల కానున్న పవన్ కళ్యాణ్ చిత్రానికి ప్రమోషన్ చేసేందుకు అవకాశం వచ్చిందని, ఓజీ(OG) సినిమా డైరెక్టర్ సుజిత్(Director Sujith) ఫొటోలను చూపిస్తూ నమ్మించాడు.
అయితే ఈ సినిమా కంటే ముందు అమరన్ సినిమా ప్రమోషన్‌కు రూ.20 లక్షలు ఇస్తే వారం రోజుల్లో రెట్టింపు లాభాలు ఇస్తామంటూ నమ్మబలికారు. రెండుసార్లు ఆ ఇద్దరి బ్యాంకు ఖాతాల నుంచి అమరన్ సినిమాలో లాభాలు వచ్చాయంటూ రూ.25 లక్షలు ప్రైవేటు ఉద్యోగి ఖాతాలో జమ అయ్యాయి. ఇలా నమ్మకం కలిగిన తరువాత కంగువా, పుష్ప-2, గేమ్ ఛేంజర్ సినిమాల ప్రమోషన్ పెట్టుబడి పేరిట ఆన్లైన్లో రూ. 76 లక్షలు, మరోసారి రూ.58 లక్షలు మోసగాళ్లు తీసుకున్నారు. బాధితుడు తన ఇంటిని విక్రయించి, నగలు తాకట్టుపెట్టి, అప్పులు చేసి మొత్తం రూ.1.34 కోట్లు వారికి చెల్లించాడు. అనంతరం వారికి కాల్ చేస్తే మోసగాళ్ల ఫోన్లు స్విచ్ ఆఫ్ లో ఉండటంతో మోసపోయినట్లు గ్రహించాడు. ఆ వెంటనే బాధితుడు సీసీఎస్‌లో ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.






