ఆటో, ప్రైవేట్ ర‌వాణా కార్మికుల స‌మ‌స్య‌లు ప‌రిష్క‌రించాలి

by Nallavelli.Anjaneyulu |

తెలంగాణ రాష్ట్రంలోని ఆటో ,ప్రైవేట్ రవాణా కార్మికుల సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ,సమస్యలు పరిష్కరించకుంటే అన్ని సంఘాలను కలుపుకొని రాష్ట్ర రవాణా బంద్ చేస్తామని సీఎం రేవంత్ సర్కార్ కు బీపీటీఎం జాతీయ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి రవిశంకర్ అల్లూరి హెచ్చరిక చేశారు.

ఆటో, ప్రైవేట్ ర‌వాణా కార్మికుల స‌మ‌స్య‌లు ప‌రిష్క‌రించాలి
X

దిశ, రాంనగర్ : తెలంగాణ రాష్ట్రంలోని ఆటో ,ప్రైవేట్ రవాణా కార్మికుల సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ,సమస్యలు పరిష్కరించకుంటే అన్ని సంఘాలను కలుపుకొని రాష్ట్ర రవాణా బంద్ చేస్తామని సీఎం రేవంత్ సర్కార్ కు బీపీటీఎం జాతీయ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి రవిశంకర్ అల్లూరి హెచ్చరిక చేశారు. హైదరాబాద్, ఇందిరాపార్క్ ధర్నా చౌక్ వద్ద మంగళవారం ఆటో, ప్రైవేట్ రవాణా కార్మికుల సంక్షేమ బోర్డు ఏర్పాటు, ఆటో డ్రైవర్లకు సీఎం రేవంత్ సర్కార్ ఇచ్చిన హామీలను వెంటనే అమలు చేయాలని డిమాండ్ చేస్తూ, తెలంగాణ ప్రైవేట్ ట్రాన్స్ పోర్ట్ మజ్దూర్ మహా సంఘ్ ఆధ్వర్యంలో మహాధర్నానిర్వహించారు. ఈ ధర్నాకు బీపీటీఎం జాతీయ ప్రధాన కార్యదర్శి రవిశంకర్ అల్లూరి, ఉపాధ్యక్షులు తెలంగాణ ప్రబారి గీత సోని , ఆటో టాక్స్ డ్రైవర్స్ యూనియన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బి పెంటయ్య గౌడ్, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కే శ్రీధర్ రెడ్డి, ఆటో యూనియన్ రాష్ట్ర అధ్యక్షుడు చింతల నందకిషోర్, పీటీఎం రాష్ట్ర అధ్యక్షులు లిఖిత్ కుమార్ క్యాబ్ యూనియన్ నాయకులు మీనా, పలువురు యూనియన్ నాయకులు హాజరై మద్దతు తెలిపి మాట్లాడారు. ఎన్నికల సమయంలో డ్రైవర్ల సంక్షేమ విషయంలో హామీలు ఇచ్చి అధికారం చేపట్టాక డ్రైవర్లు ఇచ్చిన హామీలను మరిచిన రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్రంలో అస్తవ్యస్త పరిపాలన కొనసాగిస్తుందన్నారు.

మహిళల ఉచిత బస్సు ప్రయాణ వలన ఉపాధి దెబ్బతిన్న ఆటో డ్రైవర్లు ఆర్థిక స్థితి బాగోలేక తమ కుటుంబాలను పోషించుకోలేక తమ ప్రాణలను కోల్పోతుంటే సాక్షాత్తు రవాణా శాఖ మంత్రి చోద్యం చూస్తుంటే ఇటు ముఖ్యమంత్రి ధృత రాష్ట్రుని పాలన కొనసాగిస్తున్నారని అన్నారు. ఓలా, ఊబర్ ర్యాపిడో, అక్రమ బైక్ ల వలన అసలే ఆటోలు నడవక డ్రైవర్లు బాధపడుతుంటే తన స్వలాభం కొరకు కొత్త పర్మిట్లు విడుదల చేసి కోట్ల రూపాయలు బ్లాక్ మార్కెట్ కు తేరలేపి రవాణా శాఖ అధికారులపై అక్రమ ఫైనాన్సర్లపై చర్యలు శూన్యం సరి కదా అన్నారు. గూడ్స్ వాహనాల డ్రైవర్ల ఉపాధిని దెబ్బతీస్తూ వారి శ్రమను దోపిడీ చేసే పోర్టర్, మువేర్, బ్లోహార్న్, అంకుల్ డెలివరీ ఇలాంటి యాప్ ల పై ప్రభుత్వం చర్యలు తీసుకోవడం లేదన్నారు. రెడ్ అంబులెన్స్ కార్పొరేట్ కంపెనీ అంబులెన్స్ డ్రైవర్ల ఉపాధి దెబ్బతీస్తుంటే రాష్ట్ర ప్రభుత్వానికి ఎన్నిసార్లు మొరపెట్టుకున్నా పట్టించుకోవడం లేదని ఆరోపించారు. ఆటో డ్రైవర్లకు ఏటా ₹12,వేలు ఇస్తానని చెప్పి మిస్మరించిన ముఖ్యమంత్రి ప్రైవేట్ రవాణా కార్మికుల కోసం సంక్షేమ బోర్డు ఏర్పాటు చేస్తామని చెప్పి మోసం చేశారని పైగా ఆటో డ్రైవర్లు ఆత్మహత్య చేసుకునే విధంగా తన విధానాలు ఉన్నాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. 12 వేలు ఇవ్వాల్సి వస్తుందని రాష్ట్రంలో ఆటో లైసెన్స్ ఎత్తివేసిన మోసగాళ్లు సీఎం రేవంత్ రెడ్డి మంత్రి పొన్నం ప్రభాకర్ వెంటనే గద్దె దిగాలని డిమాండ్ చేశారు. రాష్ట్రంలో పోలీస్, ఆర్టీవో అధికారులు చలనాలు అధికంగా వసూలు చేసే లక్ష్యంగా పని చేస్తున్నారన్నారు. పార్కింగ్ సౌకర్యం కల్పించడం లేదని, ఉన్న పార్కింగ్ స్థలాలు కబ్జాకు సాక్షాత్తు ప్రభుత్వ అధికారుల అనుమతి ఇవ్వడం అని ఇటువంటి చర్యలు మానుకోకపోతే తీవ్ర పరిణామాలు ఉంటాయని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో గ్రేటర్ ఆటో యూనియన్ అధ్యక్షుడు శ్రీనివాస్ ముదిరాజ్, ప్రధాన కార్యదర్శి అశ్విన్ రాజు, మినీ గూడ్స్ వెహికల్ యూనియన్ శ్రీనివాస్, జహంగీర్, ఆర్ మహేష్, అంబులెన్స్ యూనియన్ నాయకులు సంతోష్, వెంకటేష్ పాల్గొన్నారు.

Next Story