- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
రైతులకు గిట్టుబాటు ధర కాదు.. రెండింతలు లాభం వచ్చేలా ధర నిర్ణయించాలి
దేశానికి అన్నదాతలైన రైతులు ఎంతో కష్టపడి పండించిన పంటలకు గిట్టుబాటు ధర కాకుండా రెండింతలు లాభం చేకూర్చేలా ధర నిర్ణయించాలని ఇండియన్ ప్రజా కాంగ్రెస్ పార్టీ కిసాన్ విభాగం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలని డిమాండ్ చేసింది.

దిశ, హిమాయత్ నగర్ : దేశానికి అన్నదాతలైన రైతులు ఎంతో కష్టపడి పండించిన పంటలకు గిట్టుబాటు ధర కాకుండా రెండింతలు లాభం చేకూర్చేలా ధర నిర్ణయించాలని ఇండియన్ ప్రజా కాంగ్రెస్ పార్టీ కిసాన్ విభాగం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలని డిమాండ్ చేసింది. ప్రస్తుత ప్రభుత్వాలు రైతులకు లాభదాయకమైన విధానాలు అమలు చేయడంలో విఫలం చెందాయని కిసాన్ విభాగం ఆరోపించింది. శుక్రవారం బషీర్ బాగ్ ప్రెస్ క్లబ్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడు కేబీ.శ్రీధర్, కిసాన్ విభాగం జాతీయ అధ్యక్షుడు సిద్ధంరెడ్డి శివ శంకర్ రెడ్డి, కిసాన్ మోర్చా రాష్ట్ర నూతన కమిటీ ని ప్రకటించిన సందర్భంగా వారు మాట్లాడారు.
తెలంగాణ రాష్ట్రంలో వ్యవసాయ రంగం తీవ్రమైన సంక్షోభాన్ని ఎదుర్కొంటోందన్నారు. రైతులు ఆర్థికంగా నష్టాల పాలవుతున్నారని.. వ్యవసాయం ప్రమాదకర వృత్తిగా మారడంతో అప్పుల భారంతో రైతు కుటుంబాలు కుంగిపోతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. యువత వ్యవసాయానికి దూరం అవుతున్నారన్నారు. సమస్యలన్నింటిని దృష్టిలో పెట్టుకుని రైతులకు మంచి చేయాలనే ఆలోచనలతో తమ పార్టీ కిసాన్ విభాగాన్ని ఏర్పాటు చేసినట్లు వెల్లడించారు. కిసాన్ మోర్చా రాష్ట్రవ్యాప్తంగా జిల్లా కమిటీలు వేసి రైతుల సమస్యల పరిష్కారం కోసం ఉద్యమిస్తామన్నారు. కార్యక్రమంలో కిసాన్ మోర్చా తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడిగా దశరథం, ఉపాధ్యక్షుడిగా కె. విజయ్ కుమార్, ప్రధాన కార్యదర్శిగా నుధాకర్ ప్రకటించారు. ఈ సమావేశంలో ఏపీ, తెలంగాణ ఇంచార్జ్ విజయకనకదుర్గ, యూత్ వింగ్ భావికప్రియ , పద్మిని పాల్గొన్నారు.






