పల్లెలు, తండాలకు 180 మంది డాక్టర్లు.. ఉచితంగా వైద్య సేవలు

by Vemula.Srinu Prasad |

ఆదివాసీ పల్లెలు, గిరిజన తండాల్లో వైద్యసేవలు అందించాలని నేషనల్ మెడికోస్ టీమ్ తన వంతుగా ప్రయత్నం చేస్తోంది..

పల్లెలు, తండాలకు 180 మంది డాక్టర్లు..  ఉచితంగా  వైద్య సేవలు
X

దిశ, తెలంగాణ బ్యూరో: ఆదివాసీ పల్లెలు, గిరిజన తండాల్లో వైద్యసేవలు అందించాలని నేషనల్ మెడికోస్ టీమ్ తన వంతుగా ప్రయత్నం చేస్తున్నది. ఇప్పటికే నార్త్ స్టేట్‌లలో వివిధ రాష్ట్రాల్లో వైద్యసేవలు అందించిన నేషనల్ మెడికోస్ టీమ్.. సౌత్‌లో ఫస్ట్ టైమ్ తెలంగాణలో ఈ ప్రోగ్రామ్ నిర్వహిస్తోంది. ‘కొమరం భీమ్ స్వాస్త్య సేవాయాత్ర’ అనే పేరుతో ఆదిలాబాద్ జిల్లాలో నేషనల్ మెడికోస్ ఆర్గనైజేషన్, ఏకలవ్య ఫౌండేషన్‌లు సంయుక్తంగా హెల్త్ క్యాంపులు నిర్వహిస్తున్నాయి. దాదాపు 180 మంది డాక్టర్లు టీమ్‌గా ఏర్పడి ఏజెన్సీ ఏరియాల్లో వైద్యశిబిరాలను నిర్వహిస్తున్నారు. ఎన్ఎంవో ఆధ్వర్యంలో ఆదిలాబాద్‌లోని కేబీ కాలనీ, మాలెబోరేగావ్, ఆర్కాపూర్‌తో సహా 15 గ్రామాల్లోని గిరిజన, ఆదివాసీ ప్రజలకు వైద్య పరీక్షలు చేశారు. రెండు రోజుల పాటు సుమారు 500 మందికి ప్రాథమిక పరీక్షలు నిర్వహించారు.

ఉచితంగా మందుల పంపిణీ

హెల్త్ సంరక్షణకు అవగాహన కల్పించడంతో పాటు అవసరమైనోళ్లకు ఉచితంగానే మందులు పంపిణీ చేశారు. వైద్యపరీక్షల్లో అబ్‌నార్మల్ వచ్చిన పేషెంట్లను ప్రభుత్వ మెడికల్ కాలేజీల్లోని స్పెషాలిటీ డాక్టర్లకు రిఫర్ చేశారు. వ్యాధి నిర్ధారణ వేగంగా జరగడం వల్ల పేషెంట్లు సకాలంలో కోలుకునే చాన్స్ ఉన్నదని, తద్వారా లైఫ్‌​స్పాన్ కూడా పెంచుకోవచ్చని నేషనల్ మెడికోస్ ఎగ్జిక్యూటివ్ మెంబర్ డాక్టర్ విజేందర్ తెలిపారు. తెలంగాణ‌లో ఈ క్యాంపులతో మేలు జరుగుతుందన్నారు. ఎన్‌ఎంవో ఆధ్వర్యంలో త్వరలో భద్రాచలం, నాగర్‌కర్నూల్, ఏటూరునాగరం వంటి ఏజెన్సీ ప్రాంతాల్లోనూ వైద్య పరీక్షలు నిర్వహించేందుకు ప్లాన్ చేస్తున్నారు. ఇది ఆదివాసీ, గిరిజన ప్రజలకు ఉపయోగకరంగా ఉంటుందని డాక్టర్లు చెప్తున్నారు.

హెల్త్ అలర్ట్‌తో స్వచ్ఛంద సేవలు

ఆదివాసీ, గిరిజన ఏరియాల్లో ఎనీమియా(రక్తహీనత) బాధితులు ఎక్కువగా ఉన్నారని నేషనల్ ఫ్యామిలీ హెల్త్ సర్వే తాజాగా వెల్లడించింది. ఏజెన్సీ ఏరియాల్లోని గర్భిణుల్లో ఎక్కువ మంది ఎనీమియాతో బాధపడుతున్నట్టు సర్వేలో తేలింది. దీన్ని పరిగణనలోకి తీసుకున్న ఎన్ఎంవో.. ప్రజలకు హెల్ప్​ చేయాలనే లక్ష్యంతో ఏజెన్సీ ఏరియాలను ఎంచుకున్నది. ఆదివాసీ, గిరిజన ఏరియాల్లో క్యాంపులు పూర్తయిన తర్వాత మిగతా పేదల బస్తీలు, కాలనీలు, ఇతర ప్రాంతాల్లోనూ హెల్త్ క్యాంపులు ఏర్పాటు చేస్తామని ఎన్‌ఎంవో డాక్టర్లు వివరిస్తున్నారు.

సీజనల్ చెకప్‌తో పాటు జనరల్ స్క్రీనింగ్

ఈ క్యాంపుల్లో బీపీ, షుగర్‌తో పాటు జనరల్ స్క్రీనింగ్‌లు నిర్వహిస్తున్నారు. అనుమానితుల నుంచి బ్లడ్ శాంపిల్ సేకరించి కంప్లీట్ బ్లడ్ పిక్చర్, వైడల్ టెస్టులు, ఫీవర్ ప్రొఫైల్ వంటి టెస్టులు చేస్తున్నారు. చిన్న పిల్లలకు ప్రత్యేకంగా పరీక్షలు నిర్వహిస్తున్నారు. సీజనల్ చెకప్‌లతో పాటు ఇతర జనరల్ స్క్రీనింగ్ నిర్వహిస్తున్నారు. దీంతో పాటు ఆరోగ్యం ఎలా కాపాడుకోవాలి? పేషెంట్లు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? పరిశుభ్రత‌తో జరిగే మేలు ఏమిటీ? హైజినిక్‌గా ఎలా ఉండాలి? ఎలాంటి ఆహారం తీసుకోవాలి? పీరియడ్స్ సమయంలో ఆడపిల్లలు, మహిళలు ఎలాంటి కేర్ తీసుకోవాలనే అంశాలపై మహిళల వైద్య బృందం ప్రత్యేకంగా అవేర్‌నెస్ కల్పిస్తోంది. ఈ క్యాంపులలో డాక్టర్లు అప్పల ప్రసాద్, కుమార్ అంగడి జీ, శంకర్, డాక్టర్ సురేంద్రబాబు, శ్రీనివాస్ గుండు, సాయిదీప్, రాహుల్, రాజులవర్ దిగంబర్, ముత్యం, సంతోష్​, ద్రోణ, తేజస్విని, సంకల్ప పాల్గొంటున్నారు.

Next Story