- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ఎట్టకేలకు చిక్కిన చిరుత.. ఊపిరి పీల్చుకున్న ఇక్రిశాట్ సిబ్బంది
హైదరాబాద్ (Hyderabad) ఇక్రిశాట్ పరిశోధనా కేంద్రం పరిసరాల్లో గత రెండు రోజులుగా చిరుత (Cheetah) యథేచ్ఛగా సంచరిస్తున్న విషయం తెలిసిందే.

దిశ, వెబ్‌డెస్క్/పటాన్‌చెరు: హైదరాబాద్ (Hyderabad) ఇక్రిశాట్ పరిశోధనా కేంద్రం పరిసరాల్లో గత రెండు రోజులుగా చిరుత (Cheetah) యథేచ్ఛగా సంచరిస్తున్న విషయం తెలిసిందే. ఈ మేరకు చిరుతను చూసిన సిబ్బంది ఆ సమాచారాన్ని అటవీ శాఖ అధికారులు అందజేశారు. ఈ క్రమంలోనే రంగంలోకి దిగిన అధికారులు చిరుత కనిపించిన ప్రాంతాల్లో బుధవారం ఉదయం సీసీ కెమెరాల (CC Cameras)తో పాటు ప్రత్యేకంగా రెండు మేకలతో ట్రాప్ బోన్ల (Trap Bones)ను ఏర్పాటు చేశారు. ఈ క్రమంలోనే ఇవాళ ఉదయం చిరుత ఎట్టకేలకు ట్రాప్ బోనులో చిక్కింది.
ఈ పరిణామంతో ఇక్రిశాట్‌లో విధులు నిర్వర్తిస్తున్న శాస్త్రవేత్తలు, సిబ్బంది, కూలీలు ఊపిరి పీల్చుకున్నారు. అనంతరం ఆ చిరుతను హైదరాబాద్ జూ పార్కు (Zoo Park)కు తరలించనున్నట్లుగా అటవీ శాఖ అధికారులు వెల్లడించారు. అయితే, మరొక చిరుత సైతం ఇక్రిశాట్‌లోనే సంచరిస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. గతంలో అదే చోట రెండు చిరుతలను అటవీ శాఖ అధికారులు బంధించారు. అయితే, కంచ గచ్చిబౌలిలో 400 ఎకరాల అటవీ భూముల్లో చెట్లను తొలగించడంతోనే అక్కడున్న చిరుతలు ఇక్రిశాట్‌లోకి ప్రవేశించాయని స్థానికంగా చర్చ జరుగుతోంది. క్రూర జంతువులు జనావాసాల్లోకి వస్తే పరిస్థితి ఏంటని స్థానికలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.






