Kite Festival : ముగిసిన కైట్ ఫెస్టివల్

by Muthe.Rajitha |

సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్స్(Secundrabad Pared Grounds) వేదికగా మూడు రోజులపాటు జరిగిన కైట్ ఫెస్టివల్(Kite Festival) నేటితో ముగిసింది.

Kite Festival : ముగిసిన కైట్ ఫెస్టివల్
X

దిశ, వెబ్ డెస్క్ : సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్స్(Secundrabad Pared Grounds) వేదికగా మూడు రోజులపాటు జరిగిన కైట్ ఫెస్టివల్(Kite Festival) నేటితో ముగిసింది. 50 దేశాలకు చెందిన 150 మంది కైట్ ఫ్లయర్స్(Kite flyers) ఈ ఉత్సవంలో పాల్గొన్నట్టు నిర్వహకులు తెలిపారు. దేశ, విదేశీ కైట్ ఫ్లయర్స్ చిత్ర విచిత్రమైన గాలిపటాలు ఎగురవేసి సందర్శకులను అబ్బురపరిచారు. హైదరాబాద్(Hyderabad) మెట్రో సంస్థ(L&T)కు చెందిన మెట్రోరైలు కైట్(Metro Rail కైట్) కు విశేష స్పందన వచ్చింది. నిజంగా మెట్రోరైలు గాలిలో ఎగురుతున్నట్టు వీక్షకులకు కనువిందు చేసింది. అదే విధంగా గత మూడు రోజులుగా పరేడ్ గ్రౌండ్స్ లో జాతీయ స్వీట్స్ ఫెస్టివల్(National Sweet Festival) నిర్వహించారు. దాదాపు 1200 ఫుడ్ స్టాల్స్ లో వివిధ రకాల ఆహార పదార్థాలు భోజన ప్రియులను ఊరించాయి. ఫుడ్ స్టాల్స్ విపరీతమైన స్పందన వచ్చినట్టు స్వీట్ ఫెస్టివల్ నిర్వహకులు తెలియజేశారు.





Next Story