- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
రీజనల్ రింగ్ రోడ్డు అలైన్‌మెంట్ మార్చాల్సిందే
సంస్థాన్ నారాయణపురం మండలం మీదుగా వెళ్తున్న రీజనల్ రింగ్ రోడ్డు అలైన్‌మెంట్ మార్కింగ్ నిబంధనలకు విరుద్ధంగా చేశారని,

దిశ, వనస్థలిపురం: సంస్థాన్ నారాయణపురం మండలం మీదుగా వెళ్తున్న రీజనల్ రింగ్ రోడ్డు అలైన్‌మెంట్ మార్కింగ్ నిబంధనలకు విరుద్ధంగా చేశారని, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు స్పందించి ప్రతిపాదిత అలైన్మెంట్ను వెంటనే మార్చాలని భూములు కోల్పోతున్న రైతులు డిమాండ్చేశారు. హయత్ నగర్ లోని లెక్చరర్ కాలనీలో శుక్రవారం సంస్థాన్ నారాయణపురం మండలంలోని గుడిమల్కాపూర్, కోతులపురం, చిమిర్యాల, కంకణాల గూడెం, సర్వేల్, పుట్టపాక కు చెందిన రైతులు సమావేశమయ్యారు. ఈ సందర్భంగా భూనిర్వాసితుడు, నారాయణపురం మండల పరిషత్ మాజీ వైస్ప్రెసిడెంట్నడికుడి అంజయ్య మాట్లాడుతూ... ప్రభుత్వం ఇచ్చిన జీవో ప్రకారం రీజినల్ రింగ్ రోడ్డుకు భూ సేకరణ చేయడం లేదని, నిబంధనలకు విరుద్ధంగా ట్రిఫుల్ఆర్మార్కింగ్చేశారని ఆరోపించారు.
ఔటర్ రింగ్ రోడ్డు నుంచి 40 కిలోమీటర్ల దూరంలో రీజినల్ రింగ్ రోడ్డు మార్గం ఉంటుందని నిబంధనల్లో చెప్పి, 30 కిలోమీటర్ల పరిధిలో ఉన్న గ్రామాల మీదుగా రోడ్డుకు మార్కింగ్చేయడం సరికాదన్నారు. చౌటుప్పల్ మున్సిపాలిటీ పరిధిలోని ఉన్న కంపెనీల భూములను కాపాడడానికి చిన్న, సన్నకారు రైతుల జీవితాలను బలిపీఠమెక్కిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. నిబంధనలకు విరుద్ధంగా మార్కింగ్చేసి భూముల్లో రోడ్డు వేస్తామంటే సహించేది లేదని, ప్రాణాలు పోయినా ఒప్పుకోమని స్పష్టం చేశారు. ట్రిఫుల్ఆర్భూసేకరణలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు బడా బాబుల భూములను రక్షిస్తూ.. పేదల భూములలో రోడ్లు వేస్తున్నారని ఆగ్రహం చేశారు. అధికారులు, ప్రజాప్రతినిధులు సరైన సమాధానం చెప్పకుండా రైతుల జీవితాలతో ఆడుకుంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి ప్రతిపాదిత రీజినల్ రింగ్ రోడ్డు మార్గాన్ని మార్చాలని డిమాండ్ చేశారు. ఈ సమావేశంలో వివిధ గ్రామాలకు చెందిన భూనిర్వాసిత రైతులు పాల్గొన్నారు.






