రేపే 38వ హైద‌రాబాద్ బుక్ ఫెయిర్ ప్రారంభం

by Nallavelli.Anjaneyulu |

దిశ, రాంనగర్ : హైద‌రాబాద్ సిటీ, తెలంగాణ సాహితీ ప్రియులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న 38వ హైదరాబాద్ బుక్ ఫెయిర్ ఈనెల 19

రేపే 38వ హైద‌రాబాద్ బుక్ ఫెయిర్ ప్రారంభం
X

దిశ, రాంనగర్ : హైద‌రాబాద్ సిటీ, తెలంగాణ సాహితీ ప్రియులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న 38వ హైదరాబాద్ బుక్ ఫెయిర్ ఈనెల 19 నుంచి 29 వరకు 11 రోజుల పాటు నిర్వహించే ఈ పుస్తక జాతర మధ్యాహ్నం ఒంటి గంట నుంచి రాత్రి 9 గంటలవరకు అందుబాటులో ఉంటుంది. ఈ బుక్స్ ఫెయిర్ ని ప్రణాళికాబద్ధంగా నిర్వహిస్తున్నామని హైదరాబాద్ బుక్ ఫెయిర్ సొసైటీ ప్రతినిధులు తెలిపారు. పుస్తకం విశిష్టత, దాని ప్రయోజనాన్ని ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లడమే తమ అంతిమ లక్ష్యమని పేర్కొన్నారు. గురువారం తెలంగాణ కళాభారతి (ఎన్టీఆర్ స్టేడియం) లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో సొసైటీ అధ్యక్షుడు కవి యూకూబ్, ప్రధాన కార్యదర్శి ఆర్.వాసు, ఉపాధ్యక్షులు బి. శోభన్ బాబు, కోశాధికారి నారాయణరెడ్డి ఈ సందర్భంగా మాట్లాడుతూ పుస్తకాన్ని, దాని ప్రాముఖ్యతను సమాజానికి తెలియజెప్పడంతో పాటు, మంచి సమాజాన్ని నిర్మించాలనే ఉద్దేశంతో ఈసారి పుస్తక విక్రయాలు, కొనుగోళ్లతో పాటు ప్రత్యేక కార్యక్రమాలను ఏర్పాటు చేసినట్లు సొసైటీ ప్రతినిధులు తెలిపారు.


దాదాపు 17 రాష్ట్రాల నుంచి 13 భాషల్లో పుస్తకాల లభ్యం అవుతాయ‌ని తెలిపారు. పుస్త‌కావిష్క‌ర‌ణ‌లు, సాంస్కృతిక కార్య‌క్ర‌మాలు హైద‌రాబాద్ జాతీయ స్థాయిలో వ‌చ్చిన పుస్త‌కాల‌పై ప్ర‌త్యేక సెష‌న్, అభివృద్ధి కోసం కృషి చేస్తున్న వారిపై ప్ర‌త్యేక సెష‌న్ ఉంటుంద‌ని తెలిపారు. సాహిత్య రంగానికి విశేష కృషి చేసిన ప్ర‌ముఖుల పేర్ల‌ను క‌మిటీ చ‌ర్చించి విజ్ఞాప‌ణ‌ల త‌రువాత నిర్ణ‌యించింది. అనిశెట్టి రజిత, కొంపల్లి వెంకట్ గౌడ్ పేర్లతో వేదికలు ఏర్పాటు చేశారు. మీడియా పాయింట్ (జర్నలిస్ట్ స్టాల్స్) లతో పాటుగా పబ్లిక్ టాయిలెట్ సౌకర్యాలు కూడా పెంచినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో హైదరాబాద్ బుక్ ఫెయిర్ సొసైటీ నిర్వాహకులు పాల్గొన్నారు.

Next Story