- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
లోక్ భవన్ వద్ద ఉద్రిక్తత.. బీఆర్ఎస్ శ్రేణుల ఆందోళన
హైదరాబాద్‌లోని లోక్ భవన్ వద్ద బుధవారం తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.

దిశ, ఖైరతాబాద్ : హైదరాబాద్‌లోని లోక్ భవన్ వద్ద బుధవారం తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. నీట్ పరీక్ష రద్దు చేయాలంటూ బీఆర్‌ఎస్‌వీ నాయకులు, కార్యకర్తలు భారీ ఎత్తున ఆందోళనకు దిగారు. ఖైరతాబాద్ చౌరస్తా నుంచి గెల్లు శ్రీనివాస్ యాదవ్ ఆధ్వర్యంలో భారీ ర్యాలీగా బయలుదేరిన బీఆర్‌ఎస్‌వీ శ్రేణులు లోక్ భవన్ ముట్టడికి ప్రయత్నించాయి. ఆందోళనకారులు పెద్ద సంఖ్యలో చేరుకోవడంతో లోక్ భవన్ పరిసరాల్లో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. పోలీసులు ముందస్తుగా భారీ బందోబస్తు ఏర్పాటు చేసి, ర్యాలీని అడ్డుకునే ప్రయత్నం చేశారు.
బీఆర్‌ఎస్‌వీ కార్యకర్తలు నినాదాలు చేస్తూ లోక్ భవన్ వైపు దూసుకెళ్లేందుకు యత్నించారు. తోపులాట చోటుచేసుకోవడంతో అక్కడ ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఈ సందర్భంగా కొంతమంది కార్యకర్తలు లోక్ భవన్ ప్రధాన గేట్ ఎక్కేందుకు ప్రయత్నించగా.. పోలీసులు లాఠీచార్జి చేసి అడ్డుకున్నారు. పోలీసులు గెల్లు శ్రీనివాస్ యాదవ్‌తో పాటు పలువురు బీఆర్‌ఎస్‌వీ నాయకులు, కార్యకర్తలను అదుపులోకి తీసుకుని వివిధ పోలీస్ స్టేషన్లకు తరలించారు. నీట్ పరీక్ష వ్యవస్థపై విద్యార్థుల్లో తీవ్ర ఆందోళన నెలకొన్న నేపథ్యంలో పరీక్షను రద్దు చేసి విద్యార్థులకు న్యాయం చేయాలని బీఆర్‌ఎస్‌వీ నాయకులు డిమాండ్ చేశారు.






