- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
TG News : తెలంగాణ రిజిస్ట్రేషన్ మార్కెట్ ధరల పెంపు!
by Muthe.Rajitha |
రాష్ట్రంలో ముఖ్యంగా రాజధాని(Hyderabad) చుట్టుపక్కల ఇకపై ఫ్లాట్స్, అపార్ట్మెంట్స్ కొనాలంటే సర్కారుకు మరింత టాక్స్ చెల్లించుకోవాల్సి వచ్చేలా ఉంది.

X
దిశ, వెబ్ డెస్క్ : రాష్ట్రంలో ముఖ్యంగా రాజధాని(Hyderabad) చుట్టుపక్కల ఇకపై ఫ్లాట్స్, అపార్ట్మెంట్స్ కొనాలంటే సర్కారుకు మరింత టాక్స్ చెల్లించుకోవాల్సి వచ్చేలా ఉంది. ఎందుకంటే తెలంగాణలో రిజిస్ట్రేషన్ మార్కెట్ ధరలు(Registration Market Value) పెంచేందుకు తెలంగాణ ప్రభుత్వం సన్నద్ధం అవుతోంది. హైదరాబాద్ ఔటర్ రింగ్ రోడ్(ORR), రీజినల్ రింగ్ రోడ్(RRR) మధ్యలో ఉన్న ప్రాంతాల్లో జరిగే భూముల లావాదేవీల రిజిస్ట్రేషన్ మార్కెట్ ధరలు పెంచాలని సర్కార్ ప్రణాళికలు రూపొందిస్తోంది.
ఈ ప్రాంతంలో అపార్ట్మెంట్స్ పై 30 శాతం, ఓపెన్ ఫ్లాట్స్ పై వంద శాతం లేదా అంతకంటే ఎక్కువ శాతం పెంచే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. అయితే ఈ పెంపుదల మార్కెట్ విలువల మార్గదర్శకాల ప్రకారమే ఉండేలా ప్రభుత్వం ప్లాన్ చేస్తోందని సమాచారం.
Next Story






