- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
Hyderabad : తెలంగాణ సర్కార్ కీలక నిర్ణయం.. పోలీస్ స్టేషన్ల పేర్లు మార్పు
తెలంగాణ సర్కార్(Telangana Govt) మరో కీలక నిర్ణయం తీసుకుంది.

దిశ, వెబ్ డెస్క్ : తెలంగాణ సర్కార్(Telangana Govt) మరో కీలక నిర్ణయం తీసుకుంది. హైదరాబాద్ నగరంలోని పలు పోలీస్ స్టేషన్ల పేర్లు మార్చుతూ ఉత్తర్వులు వెలువరించింది. పోలీస్ స్టేషన్ల హద్దుల్లో సమస్యలు ఎదురవడం.. లా అండ్ ఆర్డర్, ట్రాఫిక్ పోలీస్ స్టేషన్లపై గందరగోళాలు ఏర్పడుతున్న నేపథ్యంలో ప్రభుత్వానికి నివేదిక పంపగా..దానికి నేడు ఆమోదముద్ర వేసినట్టు హైదరాబాద్ కమిషనర్ సీవీ ఆనంద్(Hyderabad CP CV Anand) పేర్కొన్నారు. అలాగే ప్రఖ్యాత ప్రాంతాలను దృష్టిలో పెట్టుకొని కొన్ని పోలీస్ స్టేషన్లకు, డివిజన్లకు పేర్లు మార్చినట్టు ఆయన తెలిపారు.
హుమాయన్ నగర్ పీఎస్ ను మెహిదీపట్నం పీఎస్ గా, సెక్రెటేరియట్ పీఎస్ ను లేక్ పోలీస్ స్టేషన్ గా, షాహీనాయత్ గంజ్ పీఎస్ ను గోషామహల్ పీఎస్ గా మార్చినట్టు తెలియజేశారు. ఇక 72వా లా అండ్ ఆర్డర్ పీఎస్ గా టౌలీచౌకీ ఏర్పాటు చేసినట్టు వెల్లడించారు. ఇక హైదరాబాద్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో భారీ ప్రక్షాళన చేపట్టారు సీవీ ఆనంద్. ఈ కమిషనరేట్ పరిధిలో ఏకంగా 146 మంది సీఐలను బదిలీ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. అలాగే 47 పోలీస్ స్టేషన్లకు కొత్త ఇన్స్పెక్టర్లను నియమించగా.. ట్రాఫిక్ పోలీస్ స్టేషన్లలోనూ భారీగా బదిలీలు నిర్వహించారు.






