ఏసీబీ వ‌ల‌లో విద్యాశాఖ సూప‌రింటెండెంట్..!

by Ratna Kumari |

లంచం తీసుకుంటూ విద్యాశాఖ సూప‌రింటెండెంట్, సీనియ‌ర్ అసిస్టెంట్ ఏసీబీ అధికారుల‌కు దొరికారు.

ఏసీబీ వ‌ల‌లో విద్యాశాఖ సూప‌రింటెండెంట్..!
X

దిశ, ఖైరతాబాద్ : లంచం తీసుకుంటూ విద్యాశాఖ సూప‌రింటెండెంట్, సీనియ‌ర్ అసిస్టెంట్ ఏసీబీ అధికారుల‌కు దొరికారు. హైద‌రాబాద్ లోని సైఫాబాద్ డైరెక్ట‌ర్ ఆఫ్ స్కూల్ ఎడ్యూకేష‌న్ ఆఫీస్ లో ప‌ని చేస్తున్న సూప‌రింటెండెంట్ ఫ‌ణిరాజ్, సీనియ‌ర్ అసిస్టెంట్ శ్రీధ‌ర్ లు రూ.70వేలు లంచం తీసుకుంటుండ‌గా.. ఏసీబీ అధికారులు రెడ్ హ్యాండెడ్ గా ప‌ట్టుకున్నారు. ఏసీబీ అధికారులు తెలిపిన వివరాల ప్రకారం.. ఓ వ్యక్తి తన స్కూల్ కు సంబంధించి సీబీఎస్ఈ ఎన్ఓసి సర్టిఫికెట్ కోసం దరఖాస్తు చేసుకున్నారు. ఆ ఫైల్ ను ప్రాసెస్ చేయడానికి సీనియర్ అసిస్టెంట్ శ్రీధర్ రూ.70 వేలు లంచం డిమాండ్ చేశాడు. తాను సూపరింటెండెంట్ తో మాట్లాడి ఎన్వోసీ ఇప్పిస్తానని తెలిపాడు. అయితే బాధితుడు లంచం ఇవ్వడం ఇష్టం లేక ఏసీబీ అధికారులను ఆశ్రయించారు. గురువారం వారు డిమాండ్ చేసిన రూ.70 వేలు సూపరింటెండెంట్ సమక్షంలో సీనియర్ అసిస్టెంట్ తీసుకున్న సమయంలో ఏసీబీ అధికారులు రైడ్ చేసి పట్టుకున్నారు. ఇద్దరు అధికారులపై కేసు నమోదు చేసి, వారిని న్యాయస్థానం ముందు హాజరు పరిచినట్లు ఏసీబీ అధికారులు వెల్ల‌డించారు.

Next Story