తెలుగు విశ్వవిద్యాలయంలో వేసవి శిక్షణ

by Nallavelli.Anjaneyulu |

సురవరం ప్రతాప్ రెడ్డి తెలుగు విశ్వవిద్యాలయంలో సినీ నటన, లలితకళల్లో 30 రోజులపాటు వేసవి శిక్షణ తరగతులు నిర్వహించనున్నట్లు యూనివర్సిటీ రిజిస్ట్రార్ హనుమంత రావు ఒక ప్రకటనలో తెలిపారు.

తెలుగు విశ్వవిద్యాలయంలో వేసవి శిక్షణ
X

దిశ, రవీంద్ర భారతి : సురవరం ప్రతాప్ రెడ్డి తెలుగు విశ్వవిద్యాలయంలో సినీ నటన, లలితకళల్లో 30 రోజులపాటు వేసవి శిక్షణ తరగతులు నిర్వహించనున్నట్లు యూనివర్సిటీ రిజిస్ట్రార్ హనుమంత రావు ఒక ప్రకటనలో తెలిపారు. మే 2 నుంచి కోర్సులు ప్రారంభం కానుండగా.. ఏప్రిల్ 20 నుంచి మే 1 వరకు దరఖాస్తులు స్వీకరించనున్నారు. సినీ నటన కోర్సు ఫీజు రూ.5,000, ఫైన్ ఆర్ట్స్ కోర్సు ఫీజు రూ.3,000గా నిర్ణయించారు. బాచుపల్లిలోని విశ్వవిద్యాలయ ప్రాంగణంలో తరగతులు నిర్వహించనున్నారు. పూర్తి వివ‌రాల‌కు 9346461733, 8301011865 నంబర్ లలో సంప్రదించవచ్చునని పేర్కొన్నారు.

Next Story