- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
మల్కాజిగిరి పోలీస్ కమిషనర్ గా సుమతి
ప్రభుత్వం చేసిన బదిలీలలో పోలీస్ కమిషనరేట్ కి ఎస్బీఐ ఛీఫ్ గా ఉన్న సుమతిని మల్కాజిగిరి పోలీస్ కమిషనరేట్ సీపీగా నియమించింది.

దిశ, సిటీ క్రైం : మూడు నెలల్లోనే మల్కాజిగిరి పోలీస్ కమిషనర్ అవినాష్ మహంతిని ప్రభుత్వం బదిలీ చేసింది. శుక్రవారం ప్రభుత్వం చేసిన బదిలీలలో పోలీస్ కమిషనరేట్ కి స్పెషల్ ఇంటెలిజెన్స్ బ్రాంచ్ (SIB) ఛీఫ్ గా ఉన్న సుమతిని మల్కాజిగిరి పోలీస్ కమిషనరేట్ సీపీగా నియమించింది. అవినాష్ మహంతిని డ్రగ్స్ కంట్రోల్ అడ్మినిస్ట్రేషన్ కి బదిలీ చేసింది. ఎక్సైజ్ అండ్ ప్రొహిబిషన్ శాఖ డైరెక్టర్ తో పాటు ఏసీబీ డైరెక్టర్ గా బాధ్యతలను అప్పజెప్పింది. ఫ్యూచర్ సిటీ పోలీస్ కమిషనర్ గా తరుణ్ జోషిని నియమించింది. ప్రస్తుతం సీపీగా ఉన్న సుధీర్ బాబు ఈనెల 30న పదవీ విరమణ పొందుతున్నారు. మావోయిస్టుల లొంగుబాటు పై కేంద్రం విధించిన గడువులోపు రాష్ట్రానికి చెందిన మావోయిస్టు కీలక నేతలు లొంగుబాటు పట్టేలా జరిగిన వ్యవహారంలో ఐజీ సుమతి కీలకంగా వ్యవహరించి ప్రత్యేక గుర్తింపు పొందారు.






