- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
లక్ష్యాన్ని నిర్దేశించుకుని విద్యార్థిని విద్యార్థులు ఉన్నత స్థాయికి ఎదగాలి : మంత్రి పొన్నం
మారుతున్న కాలానికి, పరిస్థితులకు అనుగుణంగా విద్యార్థులు లక్ష్యాన్ని నిర్దేశించుకుని ఉన్నత స్థానానికి ఎదిగి ఇతరులకు ఆదర్శంగా నిలవాలని రాష్ట్ర రవాణా బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు.

దిశ, బేగంపేట : మారుతున్న కాలానికి, పరిస్థితులకు అనుగుణంగా విద్యార్థులు లక్ష్యాన్ని నిర్దేశించుకుని ఉన్నత స్థానానికి ఎదిగి ఇతరులకు ఆదర్శంగా నిలవాలని రాష్ట్ర రవాణా బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. మంగళవారం బేగంపేట ఐఏఎస్ ఆఫీసర్స్ క్లబ్ లో బీసీ గురుకులాలు, హాస్టల్స్ లో పదవ తరగతిలో అత్యుత్తమ మార్కులు సాధించిన విద్యార్థులకు నిర్వహించిన సన్మాన కార్యక్రమంలో మంత్రి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ మహాత్మా జ్యోతిరావు పూలే గురుకుల పాఠశాలలో మంచి ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు అభినందనలు, శుభాకాంక్షలు తెలిపారు.
593 మార్కులు తెచ్చుకున్న దుర్గాభవాని,590 మార్కులు తెచ్చుకున్న శివాని,580 కి పైగా మార్కులు తెచ్చుకున్న 31 మంది ,570 పైన మార్కులు తెచ్చుకున్న 216 మంది విద్యార్థులు, వారి తల్లిదండ్రులకు వారి ప్రాంతానికి రాష్ట్రానికి పేరు తెచ్చారని అభినందించారు. బీసీ గురుకుల పాఠశాలలు ,హాస్టల్ లో లక్షలాది మంది విద్యార్థులు చదువుతున్నారని మంచి బోధన అందిస్తున్నఅధ్యాపకవర్గానికి అభినందనలు తెలిపారు. పదవ తరగతి పరీక్షల్లో 17 వేల మంది విద్యార్థులు పరీక్షలు రాస్తే వందల్లోనే 570 కి పైగా మార్కులు వచ్చాయని అన్నారు.మరింత మంది విద్యార్థులకు మార్కులు వచ్చేలా మీ కృషి పెరగాలన్నారు.
ప్రోత్సాహం మీ సమస్యలు పై పరిష్కారం ప్రభుత్వం ఎప్పటికపుడు పూర్తి చేస్తుందన్నారు. మీ దగ్గర నుండి మంచి ఫలితాలు రావాలని, విద్యార్థులు పాస్ మాత్రమే కాకుండా మంచి ర్యాంకులు వచ్చేలా అధ్యాపకులు కృషి చేయాలన్నారు. ఉపాధ్యాయులకు రావాల్సిన బెనిఫిట్స్ సంస్థ తరుపున ప్రభుత్వం నుండి ఎప్పటికప్పుడు ఇస్తున్నామని తెలిపారు. ఈ అకాడమీ నుండి 140 స్కూల్ లలో 100 శాతం ఉత్తీర్ణత శాతం ఉందని, మిగిలిన స్కూల్ లో ఎందుకు తక్కువ వచ్చిందని రివ్యూ చేయాలన్నారు. సంవత్సరంలో 300 రోజులు పిల్లలు ఉపాధ్యాయుల వద్దనే ఉంటారని, వారు పేరెంట్స్ కంటే ఎక్కువ గురుకులాల్లోనే మీ దగ్గర దగ్గరే ఉంటారని, వాళ్లలో మంచి చదువు నైపుణ్యాలు అందించాలని అన్నారు.
ట్రెక్కింగ్, సెయిలింగ్ పోటీలకు కూడా వారికి నైపుణ్యాలు అందిస్తున్నామని, చెడు ప్రభావానికి లోను కాకుండా భవిష్యత్తును లక్ష్యంగా ఎంచుకొని మారుతున్న కాలానికి, పరిస్థితులకు అనుగుణంగా పోటీ ప్రపంచంలో నెగ్గి ఉన్నత స్థానాలకు ఎదగాలన్నారు. గతంలో చదువుకోవడానికి వసతులు లేవని మారుతున్న కాలానికి అనుగుణంగా తిండి లేకున్న మంచి చదువు అందించాలని తల్లిదండ్రులు కోరుకుంటున్నారని అన్నారు.మీరంతా పోటీ ప్రపంచంలో నెగ్గేలా విధానపరమైన మార్పులను అవగతం చేసుకోవాలని, ప్రభుత్వం పిల్లలకు ప్రోత్సాహం ఇచ్చి వాళ్ళకి మంచి పౌష్టిక ఆహారం అందించడానికి 40 శాతం మెస్ చార్జీలు పెంచాం.200 శాతం కాస్మొటిక్ చార్జీలు ప్రభుత్వం పెంచిందని అన్నారు.
ఈ కార్యక్రమంలో పాల్గొన్న బీసీ సంక్షేమ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ శ్రీధర్,కమిషనర్ బాల మాయాదేవి , గురుకుల సెక్రటరీ సైదులు ,ఎమ్బీసీ ఫైనాన్స్ కార్పొరేషన్ కార్పొరేషన్ వైస్ చైర్మన్ మరియు మేనేజింగ్ డైరెక్టర్ డాక్టర్ మల్లయ్య భట్టు, సిఈఓ అలోక్ కుమార్, మద్దిలేటి, ఙివి శ్యాం ప్రసాద్ లాల్, డాక్టర్ జి తిరుపతి, వసతి గురువాహాల అధికారులు, సంక్షేమ శాఖ అధికారులు తదితరులు పాల్గొన్నారు.






