వాటర్ ట్యాంకర్ ఢీకొని విద్యార్థి మృతి.. నెటిజన్ల ఆగ్రహం

by Naga Rani Yarlagadda |   (  Updated:2025-08-06 04:40:49  IST  )

వాటర్ ట్యాంకర్ ఢీ కొట్టడంతో విద్యార్థి మృతి చెందాడు. ఈ ఘటన హైదరాబాద్ లోని ప్రగతినగర్ ఎలీప్ సర్కిల్ లో చోటుచేసుకుంది.

వాటర్ ట్యాంకర్ ఢీకొని విద్యార్థి మృతి.. నెటిజన్ల ఆగ్రహం
X

దిశ, వెబ్‌డెస్క్: వాటర్ ట్యాంకర్ ఢీ కొట్టడంతో విద్యార్థి మృతి చెందాడు. ఈ ఘటన హైదరాబాద్ లోని ప్రగతినగర్ ఎలీప్ సర్కిల్ లో చోటుచేసుకుంది. వాటర్ ట్యాంకర్ డ్రైవర్ ర్యాష్ గా డ్రైవ్ చేస్తూ ఓ బైక్ ను ఢీ కొట్టాడు. బైక్ పై ఉన్న విద్యార్థి తీవ్రగాయాలై అక్కడికక్కడే మరణించాడు. వెంటనే స్థానికులు పోలీసులకు సమాచారమివ్వగా.. ఘటనా స్థలానికి చేరుకుని మృతుడు మూసాపేటకు చెందిన నిఖిల్ గా గుర్తించారు. ప్రమాదం అనంతరం డ్రైవర్ వాటర్ ట్యాంకర్ ను అక్కడే వదిలేసి పరారయ్యాడు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

కాగా.. నగరంలో వాటర్ ట్యాంకర్లు నడిపే డ్రైవర్లు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారని నెటిజన్లు మండిపడుతున్నారు. వాటర్ ట్యాంకర్లకు డిమాండ్ ఎక్కువయ్యే సరికి లాభం కోసం ఎక్కువ ట్రిప్పులు వేయాలని ర్యాష్ డ్రైవింగ్ చేస్తున్నారని ఆరోపించారు. డబ్బు సంపాదన మైకంలో పడి అమాయకుల ప్రాణాలను బలి తీసుకుంటున్నారని అన్నారు.

Next Story