- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ముగిసిన స్ట్రీట్ ఫుడ్ వెండర్స్ ట్రైనింగ్.. 180 మందికి సర్టిఫికెట్స్ అందజేత
జీహెచ్ఎంసీ పరిధిలోని స్ట్రీట్ ఫుడ్ వెండర్లకు ఆహార భద్రత మరియు పరిశుభ్రతపై రెండు రోజుల శిక్షణ ముగిసింది.

దిశ, తెలంగాణ బ్యూరో: జీహెచ్ఎంసీ పరిధిలోని స్ట్రీట్ ఫుడ్ వెండర్లకు (వీధి ఆహార విక్రేతలకు) ఆహార భద్రతపై అవగాహన కల్పించేందుకు జీహెచ్ఎంసీ ఫుడ్ సేఫ్టీ విభాగం ప్రత్యేక శిక్షణ కార్యక్రమాలను నిర్వహించింది. యూసీడీ (UCD), నెస్లే ఇండియా, నేషనల్ అసోసియేషన్ ఆఫ్ స్ట్రీట్ వెండర్స్ ఆఫ్ ఇండియా (NASVI) సహకారంతో ఈ నెల 12, 13 తేదీల్లో ఈ కార్యక్రమం జరిగింది. రెండు రోజుల పాటు జరిగిన ఈ శిక్షణలో 180 మంది విక్రేతలు పాల్గొన్నారు. శిక్షణ పూర్తి చేసుకున్న వారికి సర్టిఫికెట్లను అందజేశారు.
ఈ సందర్భంగా స్ట్రీట్ ఫుడ్ తయారీలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు, వ్యక్తిగత పరిశుభ్రత, పరిసరాల శుభ్రత, ట్రేడ్ లైసెన్స్, ఫుడ్ బిజినెస్ రిజిస్ట్రేషన్ వంటి అంశాలపై నిపుణులు అవగాహన కల్పించారు. శిక్షణ ముగింపు సందర్భంగా బుధవారం జీహెచ్ఎంసీ ప్రధాన కార్యాలయంలో అసిస్టెంట్ ఫుడ్ కంట్రోలర్ (AFC) మూర్తిరాజు విక్రేతలకు కీలక సూచనలు చేశారు.






