రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి మరొకరికి గాయాలు

by Bhanu |

నారాయణగూడ పోలీస్ స్టేషన్ పరిధిలో రోడ్డు ప్రమాదం చోటు చోటుచేసుకుంది. స్పోర్ట్స్ బైక్ వేగంగా డివైడర్ ను ఢీకొట్టిన ఘటనలో ఒకరు మృతి చెందారు.

రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి మరొకరికి గాయాలు
X

దిశ, హిమాయత్ నగర్ : నారాయణగూడ పోలీస్ స్టేషన్ పరిధిలో రోడ్డు ప్రమాదం చోటు చోటుచేసుకుంది. స్పోర్ట్స్ బైక్ వేగంగా డివైడర్ ను ఢీకొట్టిన ఘటనలో ఒకరు మృతి చెందారు. మరొకరికి తీవ్ర గాయాలయ్యి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. కూకట్ పల్లికి చెందిన ఉషాశ్రీ(21), అభిషేక్(21)లు స్నేహితులు. బుధవారం రాత్రి హిమాయత్ నగర్ స్ట్రీట్ నెం.14లోని స్నేహితుడి ఇంట్లో జరిగిన పార్టీకి ఉషాశ్రీ, అభిషేక్ లు హాజరయ్యారు. తిరిగి గురువారం ఉదయం అభిషేక్ తన స్పోర్ట్స్ బైక్ వేగంగా డివైడర్ ను ఢీకొట్టడంతో ప్రమాదంలో ఉషాశ్రీ గాలిలో ఎగిరిపడి తల రోడ్డుకు బలంగా తగలడంతో తీవ్ర రక్తస్రావం, అభిషేక్ కు తీవ్ర గాయాలు కావడంతో వెంటనే వారిని స్థానికులు హైదర్ గూడ అపోలో హాస్పిటల్ కు తరలించారు. చికిత్స పొందుతూ ఉషాశ్రీ మృతి చెందగా అభిషేక్ కు వైద్యులు ఐసీయూలో చికిత్స అందిస్తున్నారు. ఆయన పరిస్థితి కూడా ఆందోళనకరంగా ఉందని వైద్యులు తెలిపారు. ఈ సంఘటనపై నారాయణగూడ పోలీసులు కేసు నమోదు చేసి, ఉషాశ్రీ మృతదేహాన్ని పోస్టు మార్టం నిమిత్తం ఉస్మానియా మార్చురీకి తరలించారు.




Next Story