- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Home > జిల్లా వార్తలు > హైదరాబాద్ > తెలుగు విశ్వవిద్యాలయం విద్యార్ధుల కోసం ప్రత్యేక యాప్ అందుబాటులోకి
తెలుగు విశ్వవిద్యాలయం విద్యార్ధుల కోసం ప్రత్యేక యాప్ అందుబాటులోకి
దిశ, హిమాయత్ నగర్ : తెలుగు భాషా-సంస్కృతుల పరిరక్షణకు కట్టుబడి ఉన్న తెలుగు విశ్వవిద్యాలయం, విద్యార్థుల సౌకర్యార్థం ఒక ప్రత్యేక డిజిటల్

X
దిశ, హిమాయత్ నగర్ : తెలుగు భాషా-సంస్కృతుల పరిరక్షణకు కట్టుబడి ఉన్న తెలుగు విశ్వవిద్యాలయం, విద్యార్థుల సౌకర్యార్థం ఒక ప్రత్యేక డిజిటల్ యాప్‌ను అందుబాటులోకి తీసుకువచ్చామని తెలుగు వర్శిటీ ఉపాధ్యక్షులు ఆచార్య నిత్యానందరావు తెలిపారు. గురువారం తెలుగు వర్సిటీ విద్యార్థుల సమక్షంలో ప్రత్యేక యాప్ ని ఆయన ప్రారంభించి మాట్లాడారు. నేటి డిజిటల్ యుగంలో ఇప్పటి విద్యార్థుల జీవనశైలి పూర్తిగా మొబైల్ ఫోన్‌పై ఆధారపడిన నేపథ్యంలో, అవసరమైన సమాచారాన్ని ఒకే వేదికపై అందించాలనే ఉద్దేశంతో ఈ యాప్‌ను రూపొందించామని తెలిపారు. కార్యక్రమంలో కోటక్ మహేంద్ర బ్యాంక్ జోనల్ మేనేజర్ సుబ్రహ్మణ్యం, సెంట్రల్ జోనల్ మేనేజర్ శ్రీనివాస్ రెడ్డి, పబ్లిక్ రిలేషన్ మేనేజర్ వెంకట సత్యప్రసాద్ పాల్గొన్నారు.
Next Story






