Speaker Gaddam Prasad Kumar : ప్రారంభమైన అక్కన్న మాదన్న బోనాల వేడుకలు

by Chintha Aamani |   (  Updated:2024-07-19 13:17:39  IST  )

హరిబౌలిలోని చరిత్రాత్మకమైన శ్రీ అక్కన్న మాదన్న మహంకాళి

Speaker Gaddam Prasad Kumar : ప్రారంభమైన  అక్కన్న మాదన్న బోనాల వేడుకలు
X

దిశ,చార్మినార్​ : హరిబౌలిలోని చరిత్రాత్మకమైన శ్రీ అక్కన్న మాదన్న మహంకాళి ఆలయంలో 76వ బోనాల ఉత్సవాలు శుక్రవారం అం రంగ వైభవంగా ప్రారంభమయ్యాయి. ఉదయం అమ్మవారి ప్రత్యేక అభిషేకం, ప్రత్యేక అలంకరణ, అర్చన హారతి కలశ స్థాపన పూజలు ఘనంగా నిర్వహించారు. అనంతరం తెలంగాణ తెలంగాణ శాసనసభ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ చేతుల మీదుగా ధ్వజారోహణ కార్యక్రమాలు జరిగాయి. ఈ సందర్భంగా తెలంగాణ శాసనసభ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ మాట్లాడుతూ రాష్ట్ర ప్రజలు సుఖ సంతోషాలతో ఉండేలా దీవించాలని అమ్మవారిని వేడుకున్నాని తెలిపారు. వర్షాలు సకాలంలో పడి రైతులు సుభిక్షంగా ఉండాలని కోరారు.ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి అమ్మవారు ఆయు ఆరోగ్యాలు కల్పించాలని కోరారు. ప్రజలకు ఇచ్చిన వాగ్దానాలు ప్రతి ఇంటికి చేరేలా దీవించాలని కోరారు.అనంతరం మాతృమూర్తుల చే ఆషాఢ మాస రెండో వారం సామూహిక కుంకుమార్చన కార్యక్రమం అక్కన్న మాదన్న ప్రార్థన మందిరంలో ఘనంగా జరిగింది.

Next Story