- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
నాంపల్లి పెట్రోల్ బంకులో షాకింగ్ ఘటన.. మహిళ పై గుర్తు తెలియని వ్యక్తి దాడి
అబిడ్స్ పోలీస్ స్టేషన్ పరిధిలోని భారత్ పెట్రోల్ బంక్‌లో ఓ మహిళ పై ఓ గుర్తు తెలియని వ్యక్తి దాడి చేశాడు.

దిశ, కార్వాన్:నాంపల్లి పెట్రోల్ బంకులో షాకింగ్ ఘటన వెలుగులోకి వచ్చింది. అబిడ్స్ పోలీస్ స్టేషన్ పరిధిలోని భారత్ పెట్రోల్ బంక్‌లో ఓ మహిళ పై ఓ గుర్తు తెలియని వ్యక్తి దాడి చేశాడు. వివరాల్లోకి వెళితే.. నాంపల్లి లోని చౌరస్తా వద్ద ఉన్నపెట్రోల్ బంక్‌లో సోమవారం తెల్లవారు జామున ఓ మహిళ పెట్రోల్ పోయించుకుంటున్న సమయంలో పెట్రోల్ కోసం లైన్‌లో నిలబడ్డ మహిళా తన ముందు ఉన్న వ్యక్తిని కొంచెం ముందుకు వెళ్ళండి అని అడగడంతో మహిళ పై ఓ వ్యక్తి దాడికి పాల్పడి కడుపులో గుద్దాడు. ఇది గమనించిన వాహన దారులు అడ్డుకొని ఆందోళనకు దిగారు.
నాంపల్లి స్టేషన్‌కు పెద్ద ఎతున్న చేరుకున్న ఇరువర్గాల మధ్య కొద్ది సేపు ఆందోళన నెలకొనడంతో కొద్దిసేపు ఉద్రిక్తత వాతావరణం నెలకొంది. సమాచారం అందుకున్న పోలీసులు అక్కడికి చేరుకుని ఆ వ్యక్తిని అదుపులోకి తీసుకుని విచారణ చేపట్టారు. బాధితురాలి బంధువులు అబిడ్స్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. దాడికి పాల్పడిన వ్యక్తి మద్యం సేవించి ఉన్నట్లు సమాచారం. ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.






