- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Secunderabad:ఓలా బైక్ షోరూం ముందు కస్టమర్ల ధర్నా
భారత్ దేశంలోని ఈవీ రంగంలో అగ్రగామిగా కొనసాగుతున్న OLA స్కూటర్ల గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు.

దిశ, వెబ్‌డెస్క్:భారత్ దేశంలోని ఈవీ రంగంలో అగ్రగామిగా కొనసాగుతున్న OLA స్కూటర్ల గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ముఖ్యంగా ఈవీ స్కూటర్ల అమ్మకాలలో ఓలా తన మార్క్ చూపుతున్నాయి. అయితే.. గత కొన్నిరోజులుగా ఓలా ఎలక్ట్రిక్ స్కూటర్లలో చాలా సమస్యలు వస్తున్నాయని సికింద్రాబాద్,బేగంపేటలోని ఓలా షోరూం ముందు కొంత మంది కస్టమర్లు ఈ రోజు మధ్యాహ్నం ధర్నాకు దిగారు.
ఈ సందర్బంగా,ఓ కస్టమర్ మీడియాతో మాట్లాడూతూ.." ఓలా స్కూటీలలో చాలా సమస్యలు ఉన్నాయన్నాడు. OLA షోరూంకు గత 8 నెలల నుంచి చెప్పులు అరిగేలా తిరుగుతున్నాని, బండిలో టెక్నికల్ సమస్యల వల్ల చాలా ప్రమాదాలు జరుగుతున్నాయని మేనేజ్మెంట్ దృష్టికి తీసుకెళ్తే పట్టించుకోవడం లేదని బాధితుడు ఆగ్రహం వ్యక్తం చేశాడు. ఇంకా బాధితుడు మాట్లాడూతూ.. బ్యాటరీలో సమస్యల వల్ల ఓలా స్కూటర్లు కాలిపోతున్నయాని , బండి బాగాలేదని, దయచేసి ఓలా స్కూటర్లను ఎవరు కొనవద్దని ప్రజలకు విజ్ఞపి చేశాడు.
- Tags
- ola bike






