96,938 పీటీఐఎన్‌ల గుర్తింపు.. గణనీయంగా పెరగనున్న బల్దియా ఆదాయం

by Malleboina Mahesh |

గ్రేటర్ హైదరాబాద్‌లో ఆస్తిపన్ను చెల్లింపులో భారీగా అవకతవకలు చోటు చేసుకుంటున్నాయి.

96,938 పీటీఐఎన్‌ల గుర్తింపు.. గణనీయంగా పెరగనున్న బల్దియా ఆదాయం
X

దిశ, సిటీ బ్యూరో : గ్రేటర్ హైదరాబాద్‌లో ఆస్తిపన్ను చెల్లింపులో భారీగా అవకతవకలు చోటు చేసుకుంటున్నాయి. కమర్షియల్ బిల్డింగ్స్, ట్రేడ్ లైసెన్స్ ఉన్నా కమర్షియల్ కేటగిరిలో విద్యుత్ కనెక్షన్లు తీసుకున్న భవనాలు సైతం రెసిడెన్షియల్ కేటగిరిలోనే ఆస్తిపన్ను చెల్లిస్తున్నట్టు అధికారులు గుర్తించారు. ఇక నుంచి ఇలాంటి వాటికి చెక్ పెట్టేందుకు బల్దియా ఆస్తిపన్ను డేటాతో టీజీ ఎస్పీడీసీఎల్ డేటాను అనుసంధానం చేసి ఎం/ఎస్ సోల్ పేజ్ సాంకేతిక విశ్లేషణతో ఆస్తి పన్ను ఆదాయాన్ని పెంచేందుకు చర్యలు ప్రారంభించారు. అందులో భాగంగానే జీహెచ్ఎంసీ ఆస్తి పన్ను గుర్తింపు సంఖ్యలు (పీటీఐఎన్‌లు), విద్యుత్ సేవా కనెక్షన్లతో (యూఎస్సీలు) అనుసంధానం చేశారు.

డోర్ నంబర్ల మ్యాచ్..

మొదటి దశలో జీహెచ్ఎంసీ పరిధిలోని ఆరు జోన్లలో రెసిడెన్షియల్ కేటగిరిలో ఉన్న 96,938 పీటీఐఎన్‌లు కమర్షియల్ కేటగిరిలో ఉన్నట్టు విద్యుత్ కనెక్షన్ల అనుసంధానం ద్వారా గుర్తించారు. ఎల్బీనగర్ జోన్‌లో 9,761, చార్మినార్‌లో 26,056, ఖైరతాబాద్‌లో 22,514, సికింద్రాబాద్‌లో 22,005, కూకట్‌పల్లిలో 7,260, శేరిలింగంపల్లి జోన్ పరిధిలో 9,342 ఉన్నట్లు గుర్తించారు.

80 నుంచి 99% సరిపోలిక

జీహెచ్ఎంసీ పీటీఐఎన్‌లను విద్యుత్ కనెక్షన్లతో అనుసంధానం చేయడంతో పాటు రెండో దశలో క్షేత్ర స్థాయిలో పరిశీలించారు. ఇందులో 80 నుంచి 99 శాతం జీహెచ్ఎంసీని తప్పుదోవ పట్టిస్తూ కమర్షియల్ కేటగిరిలో ఉన్నా రెసిడెన్షియల్ కేటగిరి ఆస్తిపన్ను చెల్లిస్తున్నట్టు గుర్తించారు. 22,169 రికార్డులను పరిశీలించి డోర్ నంబర్లు, పేర్ల ఆధారంగా సరిపోల్చి నట్టు అధికారులు చెబుతున్నారు.

Next Story