మ‌త ప‌ర‌మైన ఆంక్ష‌ల‌ను వెంట‌నే తొల‌గించాలి

by Ratna Kumari |

మతపరమైన ఆంక్షలను వెంటనే తొలగించాలని, ఎస్సీలకు సంపూర్ణ మత స్వేచ్ఛ కల్పించాలని మానవ హక్కులు నేర నిరోధక సంఘం చైర్మన్ బోడ రాకేష్ నాయక్ కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.

మ‌త ప‌ర‌మైన ఆంక్ష‌ల‌ను వెంట‌నే తొల‌గించాలి
X

దిశ, హిమాయత్ నగర్ : మతపరమైన ఆంక్షలను వెంటనే తొలగించాలని, ఎస్సీలకు సంపూర్ణ మత స్వేచ్ఛ కల్పించాలని మానవ హక్కులు నేర నిరోధక సంఘం చైర్మన్ బోడ రాకేష్ నాయక్ కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 341 కింద ఉన్న "షెడ్యూల్డ్ కాస్ట్ ఆర్డర్ 1950, క్లాజ్ 3" లోని మతపరమైన నిబంధనలు పూర్తిగా చట్టవిరుద్ధమైనవి, ఏకపక్షమైనవన్నారు. కేవలం మతం మారినంత మాత్రాన ఎస్సీ హోదాను రద్దు చేయడం అనేది సహజ న్యాయ సూత్రాలకు పూర్తి విరుద్ధం ఆయన అని అన్నారు.

మానవ హక్కులు నేర నిరోధక సంఘం ఆధ్వర్యంలో మంగళ వారం బషీర్ బాగ్ ప్రెస్ క్లబ్ లో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడారు. మతం మారినంత మాత్రాన వారిని ఎస్సీ జాబితా నుండి తొలగించడం ద్వారా వారి ప్రాథమిక హక్కులను కాలరాయడం రాజ్యాంగ స్ఫూర్తికి విరుద్ధం అని ఆయన అన్నారు. ఇప్పటికైనా కేంద్ర ప్రభుత్వం తక్షణమే స్పందించి, ఎస్సీ వ్యక్తులు ఏ మతం ఆచరించినా వారికి ఎస్సీ హోదా కోల్పోకుండా, రాజ్యాంగంలోని 14, 15, 17, 21, 25 ఆర్టికల్స్ ప్రకారం అందరికీ సమాన హక్కులు దక్కేలా "షెడ్యూల్డ్ కాస్ట్ ఆర్డర్ 1950" లోని మతపరమైన ఆంక్షలను వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేశారు. ఈసమావేశంలో సంఘం నేతలు జాన్ శ్యామ్యూల్, పి. ఏలియా, ఎండీ. షహబుద్దీన్ , రమేష్ , హీరాలాల్ తదితరులు పాల్గొన్నారు.

Next Story