Red Alert : శంషాబాద్‌ ఎయిర్‌పోర్ట్‌కు రెడ్‌ అలర్ట్‌

by Muthe.Rajitha |

శంషాబాద్‌ అంతర్జాతీయ విమానాశ్రయానికి(Shamashabad International Airport) నిఘా వర్గాలు రెడ్‌ అలర్ట్‌(Red Alert) ప్రకటించాయి.

Red Alert : శంషాబాద్‌ ఎయిర్‌పోర్ట్‌కు రెడ్‌ అలర్ట్‌
X

దిశ, వెబ్ డెస్క్ : శంషాబాద్‌ అంతర్జాతీయ విమానాశ్రయానికి(Shamashabad International Airport) నిఘా వర్గాలు రెడ్‌ అలర్ట్‌(Red Alert) ప్రకటించాయి. రానున్న గణతంత్ర దినోత్సవం(Republic Day) నేపథ్యంలో దేశంలోని అన్ని అంతర్జాతీయ విమానాశ్రయాలకు కేంద్ర నిఘా వర్గాలు రెడ్ అలర్ట్ ప్రకటించాయి. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా.. ముందు జాగ్రత్త చర్యల్లో భాగంగా ఈ నిర్ణయం తీసుకున్నట్టు అధికారులు వెల్లడించారు. ఈ క్రమంలో విమానాశ్రయానికి మరింత భద్రతను పెంచి గట్టి నిఘా ఏర్పాటు చేశారు. అదే విధంగా జనవరి 30వ తేదీ వరకు సందర్శకులు ఎవరూ ఎయిర్‌పోర్ట్‌కు రావొద్దని ఆదేశాలు జారీ చేశారు.

Next Story