- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
విధి నిర్వహణలో విశిష్ట సేవలకు గుర్తింపు
హైదరాబాద్ నగరంలో శాంతిభద్రతల పరిరక్షణలో విశేష కృషి చేసి, విధి నిర్వహణలో అత్యుత్తమ ప్రతిభ కనబరిచిన సంతోష్‌నగర్ పోలీస్ స్టేషన్ సర్కిల్ ఇన్‌స్పెక్టర్ (సీఐ) కె.సత్యనారాయణకు నగర పోలీస్ కమిషనర్ వి.సి. సజ్జనార్ ప్రశంసాపత్రం, నగదు బహుమతి అందజేశారు.

దిశ,చంపాపేట్ : హైదరాబాద్ నగరంలో శాంతిభద్రతల పరిరక్షణలో విశేష కృషి చేసి, విధి నిర్వహణలో అత్యుత్తమ ప్రతిభ కనబరిచిన సంతోష్‌నగర్ పోలీస్ స్టేషన్ సర్కిల్ ఇన్‌స్పెక్టర్ (సీఐ) కె.సత్యనారాయణకు నగర పోలీస్ కమిషనర్ వి.సి. సజ్జనార్ ప్రశంసాపత్రం, నగదు బహుమతి అందజేశారు. శనివారం హైదరాబాద్ పోలీస్ కమిషనర్ కార్యాలయంలో జరిగిన ప్రత్యేక కార్యక్రమంలో సీపీ సజ్జనార్ స్వయంగా సత్యనారాయణను అభినందించి సత్కరించారు. ప్రజల భద్రతను కాపాడడంలో, నేరాల నియంత్రణలో, శాంతి భద్రతల పరిరక్షణలో ఆయన చూపిన అంకితభావం, క్రమశిక్షణ, సమర్థవంతమైన పనితీరును గుర్తించి ఈ పురస్కారం ప్రదానం చేసినట్లు తెలిపారు.
ఈ సందర్భంగా సీపీ సజ్జనార్ మాట్లాడుతూ, పోలీస్ అధికారులు ప్రజలకు మరింత చేరువై బాధ్యతాయుతంగా సేవలు అందించాలని సూచించారు. ప్రజల విశ్వాసాన్ని నిలబెట్టే విధంగా చట్ట పరిరక్షణలో ఇదే నిబద్ధతతో ముందుకు సాగాలని ఆకాంక్షించారు. సీఐ కోలా సత్యనారాయణకు లభించిన ఈ గుర్తింపు సంతోష్‌నగర్ పోలీస్ స్టేషన్‌కే కాకుండా మొత్తం పోలీస్ శాఖకు గర్వకారణమని సహచర అధికారులు పేర్కొన్నారు. ఆయన కృషి యువ పోలీస్ అధికారులకు ఆదర్శంగా నిలుస్తుందని అభిప్రాయపడ్డారు.






