- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
లాలాగూడలో రైల్వే ఉద్యోగి అదృశ్యం
లాలాగూడ పోలీస్‌స్టేషన్ పరిధిలో రైల్వే ఉద్యోగి అదృశ్యమైన ఘటన కలకలం రేపింది.

దిశ, సికింద్రాబాద్ : లాలాగూడ పోలీస్‌స్టేషన్ పరిధిలో రైల్వే ఉద్యోగి అదృశ్యమైన ఘటన కలకలం రేపింది. పోలీసుల వివరాల ప్రకారం.. లాలాగూడ ప్రాంతానికి చెందిన జె.ఏ. ప్రతాప్ చంద్ర (46) ఈ నెల 17న ఉదయం 7:30 గంటలకు కార్యాలయానికి వెళ్తున్నానని ఇంటి నుంచి బయలుదేరి వెళ్లాడు. అయితే రాత్రి వరకు ఇంటికి తిరిగి రాకపోవడంతో కుటుంబ సభ్యులు ఆందోళనకు గురయ్యారు. బంధువులు, స్నేహితుల వద్ద వాకబు చేసినా ఎలాంటి సమాచారం లభించలేదు. దీంతో ఆయన తమ్ముడు జె. విష్ణు చంద్ర ఈ నెల 23న పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు గాలింపు చర్యలు ప్రారంభించారు. అదృశ్యమైన ప్రతాప్ చంద్ర తెలుగుతో పాటు హిందీ మాట్లాడతాడని కుటుంబ సభ్యులు తెలిపారు. ఇంటి నుంచి బయలుదేరినప్పుడు తెలుపు రంగులో నీలి గీతలున్న చెక్స్ షర్ట్, లైట్ బ్రౌన్ జీన్స్ ధరించి ఉన్నట్లు చెప్పారు. కొద్ది నెలల క్రితం కూడా ఇదే విధంగా అదృశ్యమై పది రోజుల తరువాత తిరిగి ఇంటికి చేరుకున్నట్లు తెలిసింది. ఈ ఘటనపై పోలీసులు దర్యాప్తు కొనసాగిస్తున్నారు.






