- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
SriTeja Health Update : అల్లు అర్జున్ FD చేశారు : శ్రీతేజ తండ్రి
గత డిసెంబరులో పుష్ప 29Pushpa 2) సినిమా ప్రీమియర్ షో సందర్భంగా హైదరాబాద్ లోని సంధ్య థియేటర్లో జరిగిన తొక్కిసలాట(Sandhya Theater Stampede) జరిగిన విషయం తెలిసిందే.

దిశ, వెబ్ డెస్క్ : గత డిసెంబరులో పుష్ప 29Pushpa 2) సినిమా ప్రీమియర్ షో సందర్భంగా హైదరాబాద్ లోని సంధ్య థియేటర్లో జరిగిన తొక్కిసలాట(Sandhya Theater Stampede) జరిగిన విషయం తెలిసిందే. ఈ ఘటనలో రేవతి అనే మహిళ మృతి చెందగా.. ఆమె కుమారుడు శ్రీతేజ(SriTeja) కొనప్రాణంతో ఆసుపత్రిలో చికిత్స పొందాడు. రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం రేపిన ఈ ఘటనలో.. తీవ్రంగా గాయపడిన శ్రీతేజ దాదాపు నాలుగు నెలల చికిత్స అనంతరం ఇటీవలే డిశ్చార్జ్ అయి ఇంటికి చేరుకున్నాడు. కాగా ప్రస్తుతం శ్రీతేజ హెల్త్ అప్డేట్ పై బాలుని తండ్రి భాస్కర్ వివరాలు తెలియజేశారు. శ్రీతేజ నెమ్మదిగా కోలుకుంటున్నాడని అన్నారు.
డాక్టర్ల సూచనతో ప్రస్తుతం రిహాబిలేషన్ సెంటర్ కి తీసుకు వచ్చామని, గతంతో పోలిస్తే ఇంకో పావువంతు ఆరోగ్యం నయం అయిందన్నారు. ఫిజియోథెరపీ చేయిస్తే మరింత త్వరగా కోలుకునే అవకాశం ఉందని డాక్టర్లు సూచించారని అన్నారు. కాగా ఇచ్చిన మాట ప్రకారం అల్లు అర్జున్(Allu Arjun) శ్రీతేజ పేరిట డబ్బులు FD చేశారని వెల్లడించారు. ఆసుపత్రి వైద్య ఖర్చులు అన్నీ వారే భరించారని తెలిపారు.






