ఓయో రూమ్స్‌లో వ్యభిచార రాకెట్.. తనిఖీల్లో బట్టబయలు

by Vinod kumar |

ఓయో రూమ్‌లో గుట్టుగా వ్యభిచారం నిర్వహిస్తున్న ముఠా గుట్టు - Prostitution Racket in Oyo Room in Hyderabad

ఓయో రూమ్స్‌లో వ్యభిచార రాకెట్.. తనిఖీల్లో బట్టబయలు
X

దిశ, శేరిలింగంపల్లి: ఓయో రూమ్‌లో గుట్టుగా వ్యభిచారం నిర్వహిస్తున్న ముఠా గుట్టు రట్టు చేశారు రాయదుర్గం పోలీసులు. గచ్చిబౌలి పీజేఆర్ నగర్‌లోని ఓయో హోటల్‌లో గుట్టు చప్పుడు కాకుండా వ్యభిచారం నిర్వహిస్తున్నట్లు పోలీసులకు పక్కా సమాచారం అందింది. దీంతో ఓయో హోటల్ పై దాడులు చేశారు. ఈ దాడుల్లో ఆయా రాష్ట్రాలకు చెందిన 9 మంది అమ్మాయిలు, 4 గురు విటులను అదుపులోకి తీసుకున్నారు. ప్రధాన నిర్వాహకుడు మాత్రం పరారీలో ఉన్నట్లు తెలిపారు. దీంతో వ్యభిచార ముఠా పై కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.

Next Story