ప్రముఖ రచయిత్రి కన్నుమూత

by Muthe.Rajitha |

సాహితీ లోకం మరో రచయిత్రిని కోల్పోయింది.

ప్రముఖ రచయిత్రి కన్నుమూత
X

దిశ, వెబ్ డెస్క్ : సాహితీ లోకం మరో రచయిత్రిని కోల్పోయింది. ప్రముఖ రచయిత్రి తెన్నేటి సుధాదేవి రామరాజు తుదిశ్వాస విడిచారు. గత కొంతకాలంగా అనారోగ్య సమస్యలతో బాధ పడుతున్న సుధాదేవి ఆదివారం సాయంత్రం హైదరాబాద్ లో నల్లకుంటలోని వారి స్వగృహంలో కన్నుమూశారు. విలక్షణ రచయిత్రిగా పేరు తెచ్చుకున్న సుధాదేవి కథలు, కవిత్వాలు ఎంతోమంది సాహితీ విమర్శకులను కూడా మెప్పించాయి. కేవలం రచయిత్రిగానే కాకుండా వంశీ సంస్థకు అధ్యక్షురాలిగా బాధ్యలు నిర్వహిస్తూ సాహిత్య లోకానికి, సమాజానికి ఎనలేని సేవలందించారు. సుధాదేవి మరణం తెలుగు సాహిత్య రంగానికి తీరని లోటుగా అభిప్రాయపడుతున్నారు సాహితీ ప్రేమికులు.

Next Story