- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
పవన్ కోపంలో న్యాయం ఉంది.. లేఖ సమర్థనీయమే: అల్లు అరవింద్
తెలుగు సినిమా ఇండస్ట్రీ నుంచి వెళ్లి ఎవరు ఏది అడిగినా ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ సాయం చేస్తున్నారని నిర్మాత అల్లు అరవింద్ అన్నారు...

దిశ, వెబ్ డెస్క్: తెలుగు సినిమా ఇండస్ట్రీ(Telugu Film Industry) నుంచి వెళ్లి ఎవరు ఏది అడిగినా ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్(Ap Deputy Cm Pawan Kalyan) సాయం చేస్తున్నారని నిర్మాత అల్లు అరవింద్(Producer Allu Aravind) అన్నారు. థియేటర్ల బంద్‌పై జరుగుతున్న రచ్చపై ఆయన స్పందించారు. అశ్వినీదత్ సినిమా విషయంలో టికెట్ రేటు పెంచుకునే అవకాశం కోసం పవన్ కల్యాణ్‌ను తాము కలిస్తే సీఎం చంద్రబాబును కలవమని హింట్ ఇచ్చారు. అయితే ఎవరూ పట్టించుకోలేదని తెలిపారు. చంద్రబాబు, పవన్ తమకు తెలిసినవారేనని, తామెళ్లి పని చేయించుకుంటామని నిర్మాత అశ్వినీదత్ అన్నారని అరవింద్ పేర్కొన్నారు. ఛాంబర్ కానీ, ఏం సంస్థ గానీ అధికారికంగా ఏపీ ప్రభుత్వాన్ని కలవలేదన్నారు. ఇండస్ట్రీ పెద్దలు సీఎం చంద్రబాబును కలవకపోవడంపై పవన్ కోపంలో న్యాయముందని, డిప్యూటీ సీఎం కార్యాలయం లేఖ విడుదల సమర్థనీయమేనని అల్లు అరవింద్ తెలిపారు. కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత కలవాలి కానీ అది జరగలేదన్నారు.
ఏ వ్యాపారమైనా సవ్యంగా చేసుకోవాలంటే ప్రభుత్వంతో మంచి సంబంధాలు ఉండాలని అరవింద్ చెప్పారు. ప్రైవేటు వ్యాపారమైతే ప్రభుత్వ ప్రోత్సాహం అవసరం లేదా ప్రశ్నించారు. రెండేళ్ల క్రితం ఇండస్ట్రీకి కష్టం రావడంతో గత ప్రభుత్వాన్ని కలిశామని గుర్తు చేశారు. థియేటర్లలో చాలా సమస్యలు ఉన్నాయని చెప్పారు. మనుగడ కష్టంగా ఉన్నప్పుడు థియేటర్ల బంద్ చేయడం సరికాదన్నారు. ఆ నిర్ణయం తనకు నచ్చకలేదని అందుకే ఛాంబర్ మీటింగులకు వెళ్లలేదని, తమ గీతా సంస్థ సభ్యులకు సైతం వెళ్లొద్దని చెప్పానని అల్లు అరవింద్ పేర్కొన్నారు.






