Crime News : చంచల్ గూడ జైల్లో రీల్స్ చేసిన ఖైదీ

by Muthe.Rajitha |

రాష్ట్రంలోని జైళ్ళలో భద్రతా లోపాలు మరోసారి బయట పడ్డాయి .

Crime News : చంచల్ గూడ జైల్లో రీల్స్ చేసిన ఖైదీ
X

దిశ, వెబ్ డెస్క్ : రాష్ట్రంలోని జైళ్ళలో భద్రతా లోపాలు మరోసారి బయట పడ్డాయి . రాష్ట్ర రాజధానిలోని జైల్లో పోలీసుల నిఘా మచ్చుకైనా కానరాని ఘటన హైదరాబాద్(Hyderabad) లో చోటు చేసుకుంది. ఓ కేసులో రిమాండ్ లో ఖైదీని కలిసేందుకు వచ్చిన అతని స్నేహితులు.. మూలాఖత్ లో రీల్స్(Reels) చేశారు. ఆ రీల్ కాస్త వైరల్ అవడంతో ఉన్నతాధికారులు దిద్దుబాటు చర్యలకు దిగారు. పాతబస్తీకి చెందిన అహ్మద్ జాబ్రీ ఈనెల 11న దారిదోపిడీ కేసులో అరెస్టయ్యి.. చంచల్ గూడ జైల్లో(Chanchalguda Jail) రిమాండ్ ఖైదీగా ఉన్నాడు. జాబ్రీని కలవడానికి అతని మిత్రబృందం జైలుకు వెళ్ళింది. అక్కడ మూలాఖత్ సమయంలో జాబ్రీతో కలిసి రీల్స్ చేసి, ఇన్స్టాగ్రాంలో అప్లోడ్ చేశారు. ఈ రీల్ సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవడంతో.. పోలీసు ఉన్నతాధికారులకు విషయం తెలిసి దిద్దుబాటు చర్యలకు దిగారు. రీల్స్ తీసిన నిందితుణ్ణి గుర్తించి, చాంద్రాయణగుట్ట పోలీసులకు అప్పగించారు సౌత్ ఈస్ట్ జోన్ పోలీసులు. అయితే జైల్లో పోలీసుల నిఘా లేకపోవడం వల్లే ఇలా జరిగిందని, జైల్లో కూడా నేరస్తులు ఎంజాయ్ చేస్తున్నారంటూ నెటిజన్స్ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

Next Story