- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
కష్టపడి పని చేసే వారిని పదవులు వాటంతట అవే వరిస్తాయి
by Ratna Kumari |
అంకితాభావంతో కష్ట పడి పని చేసే కార్యకర్తలను నాయకులను పదవులు వాటి అంతట అవే వరిస్తాయని కంటోన్మెంట్ ఎమ్మెల్యే శ్రీగణేష్ అన్నారు.

X
దిశ, తిరుమలగిరి : అంకితాభావంతో కష్ట పడి పని చేసే కార్యకర్తలను నాయకులను పదవులు వాటి అంతట అవే వరిస్తాయని కంటోన్మెంట్ ఎమ్మెల్యే శ్రీగణేష్ అన్నారు. సికింద్రాబాద్ జిల్లా కాంగ్రెస్ నూతన ఉపాధ్యక్షులు ఆవుల బాలరాజు యాదవ్, జనరల్ సెక్రటరీలుగా బంగారు సదానంద్, గోన శాంసన్ రాజులు గురువారం ఎమ్మెల్యేలు మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే వారిని శాలువాలతో సన్మానించి శుభాకాంక్షలు తెలిపారు. పదవులు అలంకారం కాదని, మీపై పార్టీ పట్ల మరింత బాధ్యత పెంచుతాయని, కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమం, అభివృద్ధి కార్యక్రమాలను ప్రజల్లోకి విస్తృతంగా తీసుకువెళ్ళాలని సూచించారు. పదవులను కార్యకర్తల శ్రేయస్సు, పార్టీ అభివృద్ధికి ఉపయోగించినపుడే మీకు మరింత పేరు ప్రఖ్యాతులు వచ్చి భవిష్యత్తులో మరిన్ని ఉన్నత పదవులు వరిస్తాయని పేర్కొన్నారు.
Next Story






