తుది ఓటర్ల జాబితా తయారీకి రాజకీయ పార్టీలు సహకరించాలి : హైదరాబాద్ జిల్లా ఎన్నికల అధికారి, జీహెచ్ఎంసీ కమిషనర్ ఆర్వీ కర్ణన్

by Elthuri vijay kumar |

జూబ్లీహిల్స్ అసెంబ్లీ నియోజకవర్గ ఉప ఎన్నికలకు సంబంధించి తుది ఓటర్ల జాబితా సమగ్రంగా సిద్ధం చేసేందుకు అన్ని గుర్తింపు పొందిన రాజకీయ పార్టీల ప్రతినిధులు పూర్తి సహకారం అందించాలని హైదరాబాద్ జిల్లా ఎన్నికల అధికారి , జీహెచ్ఎంసీ కమిషనర్ ఆర్ వి కర్ణన్ కోరారు.

తుది ఓటర్ల జాబితా తయారీకి రాజకీయ పార్టీలు సహకరించాలి : హైదరాబాద్ జిల్లా ఎన్నికల అధికారి, జీహెచ్ఎంసీ కమిషనర్ ఆర్వీ కర్ణన్
X

తుది ఓటర్ల జాబితా తయారీకి రాజకీయ పార్టీలు సహకరించాలి

- హైదరాబాద్ జిల్లా ఎన్నికల అధికారి, జీహెచ్ఎంసీ కమిషనర్ ఆర్వీ కర్ణన్

దిశ, జూబ్లీహిల్స్: జూబ్లీహిల్స్ అసెంబ్లీ నియోజకవర్గ ఉప ఎన్నికలకు సంబంధించి తుది ఓటర్ల జాబితా సమగ్రంగా సిద్ధం చేసేందుకు అన్ని గుర్తింపు పొందిన రాజకీయ పార్టీల ప్రతినిధులు పూర్తి సహకారం అందించాలని హైదరాబాద్ జిల్లా ఎన్నికల అధికారి , జీహెచ్ఎంసీ కమిషనర్ ఆర్ వి కర్ణన్ కోరారు. సోమవారం జీహెచ్ఎంసీ ప్రధాన కార్యాలయంలో నిర్వహించిన ప్రత్యేక సంక్షిప్త సవరణ కార్యక్రమంపై రాజకీయ పార్టీ ప్రతినిధులతో సమావేశం నిర్వహించారు. భారత ఎన్నికల సంఘం షెడ్యూల్ ప్రకారం ఇంటిగ్రేటెడ్ డ్రాఫ్ట్ ఓటర్ల జాబితా 2 సెప్టెంబర్ 2025న ప్రచురించామనీ తెలిపారు. ముసాయిదా జాబితా ప్రకారం మొత్తం 139 లొకేషన్ లు, 407 పోలింగ్ స్టేషన్లు ఉండగా 3,92,669 మంది ఓటర్లు ఉన్నారని తెలిపారు. ఈ జాబితాను అన్ని రాజకీయ పార్టీలకు అందజేసినట్లు, అలాగే తెలంగాణ ప్రధాన ఎన్నికల అధికారి, జీహెచ్ఎంసీ వెబ్‌సైట్లలో కూడా అందుబాటులో ఉంచినట్లు పేర్కొన్నారు. ప్రతి పోలింగ్ కేంద్రానికి బూత్ లెవల్ ఏజెంట్లను (BLAs) నియమించి, పారదర్శకంగా, ఖచ్చితంగా జాబితా సవరణలో భాగస్వాములు కావాలని పార్టీ ప్రతినిధులను కోరారు. సెప్టెంబర్ 17 వరకు దరఖాస్తులు, అభ్యంతరాల స్వీకరణకు అవకాశం ఉందన్నారు. జూలై 1, 2025 నాటికి 18 ఏళ్లు పూర్తిచేసుకున్న అర్హులైన పౌరులు, సెప్టెంబర్ 17లోపు తప్పనిసరిగా ఓటరుగా నమోదు అయ్యేలా చూడాలన్నారు. జాబితాలో ఏమైనా సవరణలు, మార్పులు చేర్పులు చేయాల్సి ఉంటే సెప్టెంబర్ 17లోపు సంబంధిత దరఖాస్తు ఫారాలు సమర్పించాలని చెప్పారు. ఇప్పటి వరకు ఫారం-6, 6A, 7, 8 ద్వారా వచ్చిన 2,855 దరఖాస్తులు , అభ్యంతరాల్లో 91.38 శాతం దరఖాస్తులను పరిష్కరించామని, మిగతా దరఖాస్తులను సాధ్యమైనంత త్వరగా పరిష్కరిస్తామని కర్ణన్ తెలిపారు. జూబ్లిహిల్స్ అసెంబ్లీ నియోజకవర్గంలో ప్రతి అర్హులైన ఓటరును జాబితాలో చేర్చేందుకు, తప్పులేని ఓటర్ల జాబితా సిద్ధం చేసేందుకు రాజకీయ పార్టీల సహకారం అత్యంత అవసరమని అన్నారు. తుది ఓటర్ల జాబితా సెప్టెంబర్ 30, 2025న ప్రచురించబడుతుందని పేర్కొన్నారు. ఈ సమావేశానికి ఎల్.బి.నగర్ జోనల్ కమిషనర్ హేమంత్ కేశవ్ పాటిల్, సికింద్రాబాద్ కాంటోన్మెంట్ బోర్డు జాయింట్ సీఈఓ పల్లవి విజయవన్ శి, అదనపు కమిషనర్ (ఎలక్షన్స్) మంగళతాయారు హాజరయ్యారు. అలాగే రాజకీయ పార్టీల నుండి నందేశ్ కుమార్ (బీఎస్పీ), పి. వెంకటరమణ, పవన్ కుమార్ (బీజేపీ), విజయ్ మల్లంగి (ఆప్), ఎం. శ్రీనివాసరావు (సీపీఐ–మార్క్సిస్టు), రాజేష్ కుమార్ (కాంగ్రెస్), వై. జయసింహ, కె. మాధవ్ (బీఆర్ఎస్), కె. జోగేందర్ సింగ్, ప్రశాంత్ యాదవ్ (టీడీపీ), సయ్యద్ ముస్తాక్ (ఏఐఎంఐఎం) తదితరులు హాజరయ్యారు.

Next Story