మిస్ వరల్డ్ పోటీల నేపథ్యంలో చార్మినార్ వద్ద పోలీసుల ఆంక్షలు

by Bhanu |

మిస్ వరల్డ్ పోటీలలో భాగంగా ఈ నెల 13 వ తేదీన పాతబస్తీని దేశ, విదేశాలకు చెందిన అందాల భామలు సందర్శించనున్న నేపథ్యంలో చార్మినార్ పరిసర ప్రాంతాలలో పోలీసులు అంక్షలు విధించారు.

మిస్ వరల్డ్ పోటీల నేపథ్యంలో చార్మినార్ వద్ద పోలీసుల ఆంక్షలు
X

దిశ, చార్మినార్ : మిస్ వరల్డ్ పోటీలలో భాగంగా ఈ నెల 13 వ తేదీన పాతబస్తీని దేశ, విదేశాలకు చెందిన అందాల భామలు సందర్శించనున్న నేపథ్యంలో చార్మినార్ పరిసర ప్రాంతాలలో పోలీసులు అంక్షలు విధించారు. ఈ నెల 10 వ తేదీ నుంచి 31వ తేదీ వరకు హైదరాబాద్ వేదిక గా మిస్ వరల్డ్ పోటీలు జరుగనున్నాయి. మిస్ వరల్డ్ పోటీల్లో భాగంగా ఈ నెల 13 వ తేదీన చౌమాహల్లా ప్యాలేస్, చార్మినార్, లాడ్ బజారు ప్రాంతాలలో అంద గత్తె లు సందర్శించనున్నారు.


ఇందులో 120 దేశాల ప్రతినిధులు పాల్గొననున్న నేపథ్యంలో చార్మినార్ పరిసర ప్రాంతాలలో సౌత్ జోన్ పోలీసులు కట్టు దిట్టమైన పోలీస్ బందోబస్తును ఏర్పాటు చేస్తున్నారు. చార్మినార్ పరిసరాలలో తోపుడు బండ్ల పై చిరు, పండ్ల వ్యాపారులను అక్కడి నుంచి ఖాళీ చేయించారు. మిస్ వరల్డ్ పోటీలు ముగిసేవరకు ఇక్కడ చిరు వ్యాపారాలు ఏమి నిర్వహించవద్దని, అక్కడ ఉన్న తోపుడు బండ్లను పంపించి వేశారు. దీంతో చిరు వ్యాపారులు వాగ్వి వాదానికి దిగడంతో పోలీసులు నచజెప్పి పంపించివేశారు. దీంతో చార్మినార్ పరిసర ప్రాంతాలు నిర్మానుష్యంగా మారాయి.


Next Story