- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ఏపీ ఎంపీ కుమారుడినంటూ తెలంగాణలో మోసం... వ్యక్తి అరెస్ట్
నెల్లూరు ఎంపీ కుమారుడి పేరుతో మోసానికి పాల్పడిన విక్రాంత్ రెడ్డిని పోలీసులు అరెస్ట్ చేశారు....

దిశ, వెడ్ డెస్క్: నెల్లూరు ఎంపీ కుమారుడి పేరుతో మోసానికి పాల్పడిన విక్రాంత్ రెడ్డిని పోలీసులు అరెస్ట్ చేశారు. గుంటూరు జిల్లాకు చెందిన విక్రాంత్ రెడ్డి అలియాస్ వెంకటేశ్వర్లు.. హైదరాబాద్ కేపీహెచ్‌బీ కాలనీలో ఉంటున్నారు. స్థానిక హాస్టల్‌లో తన బంధువును చేర్చించిన విక్రాంత్ రెడ్డి... మహిళా యజమానితో పరిచయం పెంచుకున్నారు. తాను ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి కుమారుడినని.. తమకు జూబ్లీహిల్స్‌లో జువెలరీ షాపు ఉందని నమ్మించారు. దీంతో తన గొలుసును రీమోడలింగ్ చేయాలని విక్రాంత్‌కు చెప్పడంతో అందుకు లక్ష ఖర్చు అవుతుందని ఆమె నుంచి తీసుకున్నారు. ఆ తర్వాత కనిపించకుండా వెళ్లిపోయారు. దీంతో మోసపోయినట్లు గ్రహించిన హాస్టల్ యజమాని పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేసిన పోలీసులు నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. నిందితుడు విక్రాంత్‌పై 14 కేసులున్నాయని గుర్తించారు.






