- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
పోక్సో చట్టం.. బాలిక, తల్లిదండ్రుల వివరాలు బయటపెడితే కఠిన చర్యలు
పోక్సో చట్టం కేసులో బాలిక, ఆమె తల్లిదండ్రుల వివరాలను సోషల్ మీడియాలో పోస్టు చేసిన వ్యవహారం పై పేట్ బషీరాబాద్ పోలీసులు కేసును నమోదు చేశారు.

దిశ, సిటీక్రైం : పోక్సో చట్టం కేసులో బాలిక, ఆమె తల్లిదండ్రుల వివరాలను సోషల్ మీడియాలో పోస్టు చేసిన వ్యవహారం పై పేట్ బషీరాబాద్ పోలీసులు కేసును నమోదు చేశారు. పోలీసులు వెల్లడించిన వివరాల ప్రకారం...పేట్ బషీరాబాద్ పోలీసు స్టేషన్ లో నమోదైన 684/2026 ఎఫ్ఐఆర్ నెం. లో బాలిక, ఆమె తల్లిదండ్రుల వివరాలు సోషల్ మీడియాలో ప్రసారమవుతున్నాయని మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా బాలల సంక్షేమ కమిటీ చైర్ పర్సన్ ఇచ్చిన ఫిర్యాదు పై పేట్ బషీరాబాద్ పోలీసులు 706/2026 ఎఫ్ఐఆర్ ను నమోదు చేశారు. ఈ ఎఫ్ఐఆర్ లో జువెనైల్ జస్టీస్ యాక్ట్ 74, 72(1) బీఎన్ఎస్, సెక్షన్ 23 పోక్సో చట్టం కింద అభియోగాలను నమోదు చేశారు. ఈ పోస్టులను చేసిన వారిని గుర్తించి వారి పై చట్టపరమైన చర్యలను తీసుకుంటామని పోలీసులు తెలిపారు. పోక్సో కేసుల్లో బాధిత బాలిక, తల్లిదండ్రుల వివరాలను బహిర్గతం చేయడం చట్ట ఉల్లంఘన అవుతుందని పోలీసులు స్పష్టం చేశారు. ఈ నేపథ్యంలో ఇలాంటి చర్యలకు పాల్పడే వారి పై చట్టపరంగా కఠిన చర్యలు తీసుకుంటామని పోలీసులు హెచ్చరించారు.






