- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
యూకేలోనూ బీఆర్ఎస్ రజతోత్సవం
బీఆర్ఎస్ సిల్వర్ జూబ్లీ సందర్భంగా యూకేలోనూ పార్టీ రజతోత్సవ సంబరాలను నిర్వహించనున్నట్లు పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ప్రకటించారు. ...

X
దిశ, తెలంగాణ బ్యూరో: బీఆర్ఎస్ సిల్వర్ జూబ్లీ సందర్భంగా యూకేలోనూ పార్టీ రజతోత్సవ సంబరాలను నిర్వహించనున్నట్లు పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ప్రకటించారు. లండన్ పర్యటనలో ఉన్న కేటీఆర్ అక్కడి ఎన్ఆర్ఐ నేతలతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా బీఆర్ఎస్ ఎన్ఆర్ఐ విభాగం విజ్ఞప్తి మేరకు ఆయన సానుకూలంగా స్పందించారు. పార్టీ రజతోత్సవ వేడుకలను ఏడాది పాటు ఘనంగా నిర్వహించాలన్న పార్టీ అధినేత కేసీఆర్ సూచన మేరకు.. ఇంగ్లాండ్‌లో కూడా నిర్వహించాలని ఎన్ఆర్ఐ నేతలు కేటీఆర్‌ను కోరారు. ప్రాంతాలకు అతీతంగా యూకేలో ఉన్న తెలుగు వాళ్లంతా ఈ సంబరాల్లో పాల్గొనడానికి ఉత్సాహంగా ఉన్నారని తెలిపారు. దీంతో పార్టీ రజతోత్సవ సంబరాలను యూకేలో నిర్వహించడానికి కేటీఆర్ నిర్ణయించారు.
Next Story






