- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Hyderabad Rain: రేపు హాలిడే ఇవ్వాలని పేరెంట్స్ డిమాండ్
హైదరాబాద్(Hyderabad) నగర వ్యాప్తంగా నేటి సాయంత్రం నుంచి భారీ వర్షం(Massive Rains) కురుస్తోంది.

X
దిశ, వెబ్ డెస్క్ : హైదరాబాద్(Hyderabad) నగర వ్యాప్తంగా నేటి సాయంత్రం నుంచి భారీ వర్షం(Massive Rains) కురుస్తోంది. నగరంలోని రోడ్లు ఎటు చూసినా చెరువులను తలపిస్తుండగా.. లోతట్టు ప్రాంతాలు పూర్తిగా జలమయం అయ్యాయి. ఒక వైపు భారీ వర్షం.. మరో వైపు ట్రాఫిక్ జామ్‌తో వాహనదారుల తీవ్ర ఇక్కట్లు ఎదుర్కొంటున్నారు. జనజీవవనం అస్తవ్యస్తం అయ్యింది. అయితే ఈ భారీ వర్షం గురువారం రాత్రితోపాటు శుక్రవారం కూడా కొనసాగే అవకాశం ఉందని వాతావరణశాఖ మరోసారి హెచ్చరికలు జారీ చేసింది. ఈ నేపథ్యంలో రేపు విద్యాసంస్థలకు సెలవు ప్రకటించాలని తల్లిదండ్రులు కోరుతున్నారు. అయితే కొన్ని విద్యాసంస్థలు రేపు వరలక్ష్మీ వ్రతం సందర్భంగా ఆప్షనల్ హాలిడే ఇవ్వగా.. చాలా స్కూల్స్, కాలేజెస్ ఇవ్వలేదు. రేపు విద్యాసంస్థలన్నిటికీ పబ్లిక్ హాలిడే ఇవ్వాలని హైదరాబాద్ కలెక్టర్ కు వినతులు వెల్లువెత్తుతున్నాయి.
Next Story






