- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Hyderabad : హైదరాబాద్ పోలీసుల అదుపులో పాక్ యువకుడు
పహల్గామ్ ఉగ్రదాడి(Pahalagam Terror Attack) నేపథ్యంలో పాకిస్తాన్ పట్ల భారత్ పలు కఠిన నిర్ణయాలు తీసుకున్న సంగతి తెలిసిందే.

దిశ, వెబ్ డెస్క్ : పహల్గామ్ ఉగ్రదాడి(Pahalagam Terror Attack) నేపథ్యంలో పాకిస్తాన్ పట్ల భారత్ పలు కఠిన నిర్ణయాలు తీసుకున్న సంగతి తెలిసిందే. పాక్ పౌరుల, పర్యటకుల వీసాలను రద్దు చేసింది. తక్షణమే భారత్‌ను విడిచి వెళ్లాలని కేంద్రం ఆదేశాలు ఇచ్చింది. అంతేకాకుండా కేంద్ర హోంమంత్రి అమిత్ షా(Amith Sha) స్వయంగా అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులకు ఫోన్లు చేసి.. పాకిస్థానీయులను పంపేయాలని ఆదేశాలు ఇచ్చారు. కేంద్రం ఆదేశాలతో అన్నిరాష్ట్రాల పోలీసులు.. అణువణువు జల్లెడ పడుతున్నారు. తెలంగాణ పోలీసులు(Telangana Police) సైతం రాష్ట్రంలో తనిఖీలు ముమ్మరం చేశారు. ఈ క్రమంలో హైదరాబాద్ నగరంలో సోదాలు నిర్వహిస్తున్న పోలీసులు పాకిస్తాన్ కు చెందిన ఓ యువకుడిని(Pakistan Person) అదుపులోకి తీసుకున్నారు.
సదరు యువకుని వివరాలపై ఆరా తీసిన పోలీసులకు పలు కీలక విషయాలు తెలిశాయి. దుబాయ్ లో ఉద్యోగం చేస్తున్న పాకిస్తాన్ కు చెందిన మహమ్మద్ ఫయాజ్ అనే యువకుడు ఇటీవలే హైదరాబాద్ లోని పాతబస్తీకి చెందిన యువతిని వివాహం చేసుకున్నట్టు విచారణలో వెల్లడైంది. ఈ నేపథ్యంలో తన భార్యను కలిసేందుకు ఫయాజ్ పాక్ నుంచి నేపాల్ మీదుగా హైదరాబాద్కు చేరుకున్నాడు. ప్రస్తుతం పోలీసుల అదుపులో ఉన్న ఆ యువకుని గురించి మరింత లోతుగా దర్యాప్తు జరిపి.. పాకిస్తాన్ కు తిరిగి పంపిస్తామని పోలీసులు వెల్లడించారు.
కాగా తెలంగాణ వ్యాప్తంగా ఉన్న పాకిస్థానీలు వెంటనే వెళ్లిపోవాలని లేని పక్షంలో చర్యలు ఉంటాయని తెలంగాణ డీజీపీ జితేందర్ రెడ్డి హెచ్చరించారు. పాకిస్తాన్ కు చెందిన వారి వీసాలు ఏప్రిల్ 27వ తేది నుంచి రద్దు చేయబడతాయిని తెలిపారు. వైద్య వీసాలు మాత్రమే ఏప్రిల్ 29వతేది వరకు చెల్లుబాటు అవుతాయని పేర్కోన్నారు. దీర్ఘకాలిక వీసాలు, దౌత్య, అధికారిక వీసాలు కలిగి ఉన్నవారికి వర్తించదని తెలిపారు. అట్టారి సరిహద్దు ఈ నెల 30వ తేది వరకు పాకిస్తానీలకు బయలుదేరడానికి తెరిచి ఉంటుందని తెలిపారు. తెలంగాణలో ఉంటున్న అన్ని పాకిస్తాన్ జాతీయులు ఈ మార్గదర్శకాలను పాటించాలని సూచించారు.






