Osmania University: ఉర్దూ యూనివర్సిటీకి మద్దతుగా ఓయూ విద్యార్థుల నిరసన

by Ramesh Naini |

ఉర్దూ యూనివర్సిటీకి మద్దతుగా ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థులు నిలిచారు.

Osmania University: ఉర్దూ యూనివర్సిటీకి మద్దతుగా ఓయూ విద్యార్థుల నిరసన
X

దిశ, డైనమిక్ బ్యూరో: ఉర్దూ యూనివర్సిటీకి మద్దతుగా ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థులు నిలిచారు. హైదరాబాద్‌లోని మౌలానా ఆజాద్ నేషనల్ ఉర్దూ యూనివర్సిటీ భూములను రాష్ట్ర ప్రభుత్వం గుంజుకునే ప్రయత్నం చేస్తుందని ఉర్దూ వర్సిటీ విద్యార్థులు ఆందోళనలు చేస్తున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలోనే ఉర్దూ యూనివర్సిటీకి ఓయూ విద్యార్థులు మద్దతు తెలిపారు. ఈ మేరకు తాజాగా ఓయూ విద్యార్థులు ఆర్ట్స్ కళాశాల ఆవరణలో కాంగ్రెస్ ప్రభుత్వం అక్రమంగా ఉర్దూ యూనివర్సిటీ 50 ఎకరాల భూమిని స్వాధీనం చేసుకోవాలని చూస్తుందని తీవ్ర ఆరోపణలు చేస్తూ నిరసన వ్యక్తం చేశారు. ప్రభుత్వం వెంటనే భూసేకరణ విరమించుకోవాలని లేదా ఉస్మానియా యూనివర్సిటీ వేదికగా రానున్న రోజుల్లో ఉర్దూ యూనివర్సిటీ కొరకు మరెన్నో ఉద్యమాలు చేస్తామని ఓయూ విద్యార్థులు హెచ్చరించారు.

Next Story