- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
బాసర ట్రిపుల్ ఐటీ విద్యార్థిని మృతికి వీసీ విధానాలే కారణం: OU JAC ఆరోపణలు
బాసర ట్రిపుల్ ఐటీ విద్యార్థిని మల్లిపూడి తేజస్విని మృతికి కారణం యూనివర్సిటీ యాజమాన్యమే అని OU JAC అధ్యక్షుడు సర్దార్ వినోద్ కుమార్ తీవ్ర ఆరోపణలు చేశారు.

దిశ, డైనమిక్ బ్యూరో: బాసర ట్రిపుల్ ఐటీ విద్యార్థిని మల్లిపూడి తేజస్విని మృతికి కారణం యూనివర్సిటీ యాజమాన్యమే అని OU JAC అధ్యక్షుడు సర్దార్ వినోద్ కుమార్ తీవ్ర ఆరోపణలు చేశారు. ఈ మేరకు ఆయన మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. తనకు సకాలంలో ట్రీట్‌మెంట్ అందించడంలో యూనివర్సిటీ యంత్రాంగం విఫలం అయ్యిందని, తాను ఇబ్బంది పడుతూ హెల్త్ సెంటర్‌కు పోతే ఇబ్బందిని గమనించకుండా మంచి ట్రీట్‌మెంట్ కోసం పెద్ద హాస్పిటల్‌కు తీసుకెళ్లి వైద్యం అందించాలనే సోయి వీసీ గోవర్ధన్‌కు లేదని విమర్శించారు. టెక్ పెస్ట్‌లలో ఫొటోలు వైరల్ చేసుకుంటూ నిండు ప్రాణాన్ని బలిగొన్నారని, సకాలంలో పెద్ద హాస్పిటల్‌కు తరలించి వైద్యం అందిస్తే విలువైన ప్రాణం కాపాడే వాళ్ళమని, వ్యక్తిగత లబ్ధి, డబ్బు సంపాదన పక్కన పెట్టి వీసీ విద్యార్థుల ప్రాణాలు కాపాడే ప్రయత్నం చేయాలని విమర్శించారు. మెరుగైన స్థాయిలో వైద్యం అందించే పరికరాలు ముఖ్యంగా డాక్టర్లను అందుబాటులో ఉంచాలని సూచించారు.
వీసీ వెంటనే రాజీనామా చేయాలి
‘ప్రయోజకులు అవుదామని బాసర ట్రిపుల్ ఐటీకి వస్తే శవాలుగా మారి ఇంటికి వెళ్లడం అత్యంత దురదృష్టకరం’ అని, విద్యార్థుల ప్రాణాలు కాపాడండి అలాగే మరణించిన విద్యార్థిని మల్లిపూడి తేజస్విని కుటుంబానికి యాభై లక్షల రూపాయల ఎక్స్ గ్రేసియా బాసర ట్రిపుల్ ఐటీ యాజమాన్యం ప్రకటించాలని డిమాండ్ చేశారు. విద్యార్థిని మృతికి ఇంచార్ట్ వీసీ గోవర్ధన్ విధానాలే కారణం, యూనివర్సిటీని నడపడం చేతకాక పోతే అవినీతి చక్రవర్తి గోవర్ధన్ వెంటనే రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. ‘తనకు ముడుపులు ఇచ్చి మెస్ కాంట్రాక్ట్‌లు తీసుకున్న వారికి రక్షణ కోసం డైలీ చక్కర్లు కొట్టే ఇంచార్ట్ వీసీ గోవర్ధన్‌కు విద్యార్థులకు సరియైన ట్రీట్మెంట్ అందించాలని గానీ వారి మరణాల మీద ఎందుకు పట్టింపు లేదో సమాధానం చెప్పాలి, ముసుగు తొందర్లోనే తొలగిస్తాం.. బాసర ట్రిపుల్ ఐటీని కాపాడుకుంటాం’ అని OU JAC అధ్యక్షుడు సర్దార్ వినోద్ కుమార్ హెచ్చరించారు.






