ఉస్మానియా హాస్టల్స్ రీ ఓపెన్.. అఫిషియల్‌గా ప్రకటించిన వర్శిటీ రిజిస్టార్

by Disha Web Desk 9 |
ఉస్మానియా హాస్టల్స్ రీ ఓపెన్.. అఫిషియల్‌గా ప్రకటించిన వర్శిటీ రిజిస్టార్
X

దిశ, వెబ్‌డెస్క్: నీటి, విద్యుత్ కొరతతో ఉస్మానియా యూనివ‌ర్సిటీ హాస్టల్స్‌కు వేస‌వి సెల‌వులు ప్రకటిస్తున్నట్లు వర్శిటీ చీఫ్ వార్డెన్ ప్రకటించిన విషయం తెలిసిందే. మే 1 నుంచి 31 వ‌ర‌కు హస్టల్స్ క్లోజ్ చేస్తున్నట్లు విద్యార్థులకు తెలిపారు. విద్యుత్, నీటి కొరతతో ప్రతిష్టాత్మక ఉస్మానియా వర్శిటీ హస్టల్స్ మూసి వేస్తు్న్నట్లు ప్రకటించడంతో విద్యార్థులతో పాటు ప్రతిపక్షాలు ప్రభుత్వ తీరుపై భగ్గుమన్నాయి. పార్లమెంట్ ఎన్నికల వేళ ఈ వ్యవహారం పొలిటికల్ టర్న్ తీసుకుంది. దీంతో వెంటనే అప్రమత్తమైన ప్రభుత్వం విద్యార్థుల నుండి వర్శిటీ హస్టల్స్ తెరిచేందుకు చర్యలు తీసుకుంది. ఈ మేరకు ఉస్మానియా రిజిస్టార్ హాస్టల్స్‌ను తిరిగి ప్రారంభించినట్లు తాజాగా అఫిషియల్‌గా ప్రకటించారు.


Read More ఖద్దరు వెనుక కన్నీటి వ్యథ లెన్నో.. సర్పంచ్ ఎన్నికలపై గ్రామాల్లో జోరుగా చర్చ !



Next Story

Most Viewed