- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్

X
దిశ, మియాపూర్: కూతురును చూడడానికి వచ్చి తిరుగు ప్రయాణంలో రైలు ఢీ కొని వృద్ద దంపతులు దుర్మరణం పాలైన విషాద సంఘటన లింగంపల్లి రైల్వే స్టేషన్ పరిదిలో చోటు చేసుకుంది. ఎస్ఐ ధారాసింఘ్ తెలిపిన వివరాల ప్రకారం.. ఏపీలోని ఈస్ట్ గోదావరి జిల్లాకు చెందిన అనంతలక్ష్మి(63), వెంకటరావు(65)లు భార్యాభర్తలు. వీరు చిల్కూర్‌లో ఉండే తమ కూతురు వద్దకు ఆదివారం వచ్చారు.
కాగా తిరుగు ప్రయాణమయ్యేందుకు లింగంపల్లిలోనీ రైల్వే 1 వ నంబర్ ప్లాట్ ఫారంలో దిగారు. వారు వెళ్ళే రైలు నర్సాపూర్ ఎక్స్ ప్రెస్ రాత్రి 7.30 కు ఉండడంతో ఈ క్రమంలో 1 వ నంబర్ ప్లాట్ ఫారం నుంచి 2 వ ప్లాట్ ఫారానికి పట్టాలపై నడుచుకుంటూ వెళుతుండగా.. విశాఖ ఎక్స్ ప్రెస్ ట్రైన్ ఢీ కొనడంతో అక్కడికక్కడే దుర్మరణం చెందారు. రైల్వే పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాఫ్తు చేస్తున్నారు.
Next Story






